హృతిక్‌తో డేటింగ్.. అతడి మాజీ భార్యతో మీటింగ్.. నెట్టింట వైరల్‌గా మారిన బ్యూటీ ఫొటోలు..

ABN , First Publish Date - 2022-02-14T21:27:50+05:30 IST

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌.. గత కొన్ని రోజులుగా ఓ అజ్ఞాత

హృతిక్‌తో డేటింగ్.. అతడి మాజీ భార్యతో మీటింగ్.. నెట్టింట వైరల్‌గా మారిన బ్యూటీ ఫొటోలు..

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌.. గత కొన్ని రోజులుగా ఓ అజ్ఞాత సుందరితో డేటింగ్ చేస్తున్నాడు. ఆమెతో కలిసి డిన్నర్ చేసేందుకు బయటికి వచ్చి కెమెరాల కంటికి చిక్కాడు. ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. హృతిక్ రోషన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో హృతిక్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లిన అమ్మాయి ఎవరు అనే విషయంపై నెటిజన్లు ఆరాలు తీశారు. చివరకు ఆమె ఓ అప్ కమింగ్ బ్యూటీ సబా ఆజాద్ అని కనిపెట్టారు. ఆమె గతంలో ‘దిల్ కబడ్డీ’, ‘ముఝసే ఫ్రెండ్ షిప్ కరోగీ’ చిత్రాల్లో నటించింది. 


సబాకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హృతిక్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఈ జంట గత కొన్నినెలలుగా డేటింగ్ చేస్తున్నారని పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ రిలేషన్‌షిప్‌పై హృతిక్, సబా ఇంతవరకు స్పందిచలేదు. ఈ వదంతులను అటుంచితే..హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్ సాయంత్రం పూట కొంత సమయాన్ని సబాఆజాద్‌తో గడిపింది. అందుకు సంబంధించిన ఫొటోను సుసానే ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఈ ఫొటో కింద క్యాప్షన్ కూడా రాసింది. ‘‘అద్భుతమైన సాయంత్రం. నువ్వు మంచి టాలెంట్ పర్సన్‌వి’’ అని ఆమె చెప్పింది. సుసానే షేర్ చేసిన పోస్ట్‌ను సబా తన హ్యాండిల్‌లోను అభిమానులతో పంచుకుంది. ‘‘థ్యాంక్ యూ సుజీ. నిన్న సాయంత్రం నువ్వు అక్కడ ఉన్నందుకు సంతోషం’’ అని పేర్కొంది. 


సబా ప్రస్తుతం ‘రాకెట్ బాయ్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. సోనీ లివ్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ షోలో జిమ్ సర్భ్, ఇష్వక్ సింగ్, రెజీనా కసాండ్రా నటించారు. హోమీ జే. బాబా పాత్రలో జిమ్ సర్భ్ కనిపించనుండగా, విక్రమ్ సారా‌భాయ్ పాత్రలో ఇష్వక్ సింగ్ నటించారు. యువకుడైన హోమీ బాబా లవర్ పాత్రలో సబా కనిపించనుంది. పార్సీ మహిళ పాత్రను ఆమె పోషించింది.

Updated Date - 2022-02-14T21:27:50+05:30 IST