లైంగిక వేధింపుల కేసులో షాకింగ్ తీర్పు.. Johnny Depp కు రూ.116 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ మాజీ భార్యకు ఆదేశాలు..!

ABN , First Publish Date - 2022-06-02T18:32:01+05:30 IST

గత కొన్ని రోజులుగా హాలీవుడ్ నటుడు జానీ డెప్, ఆయన మాజీ భార్య అంబర్ హర్డ్‌పై వేసిన పరువు నష్టం కేసు నడుస్తోంది...

లైంగిక వేధింపుల కేసులో షాకింగ్ తీర్పు.. Johnny Depp కు రూ.116 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ మాజీ భార్యకు ఆదేశాలు..!

గత కొన్ని రోజులుగా హాలీవుడ్ నటుడు జానీ డెప్, ఆయన మాజీ భార్య అంబర్ హర్డ్‌పై వేసిన పరువు నష్టం కేసు నడుస్తోంది. ఈ కేసులో బుధవారం (జూన్ 1న) వర్జీనియా కోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు 6 వారాల సుదీర్ఘ విచారణలో కేసుని జానీ డెప్ గెలిచాడు. ఈ కేసులో భాగంగా డెప్‌కి నష్టపరిహారంగా 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 116 కోట్ల)ని చెల్లించాలని హర్డ్‌కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. హర్డ్‌కి సైతం 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 15.5 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కోర్డు తీర్పు వెల్లడించింది.


నిజానికి.. డెప్‌పై హర్డ్ కొన్ని నెలల గృహ హింస కేసును దాఖలు చేసింది. అనంతరం ఈ హాలీవుడ్ నటుడు హర్డ్‌పై పరువు నష్టం కేసు పెట్టాడు. ఈ కేసు విచారణ సమయంలో డెప్ తనని మానసికంగా వేధింపులకు గురి చేశాడని విమర్శలు చేసింది. అయితే.. కోర్టు ఇచ్చిన తీర్పు తన హృదయాన్ని బ్రేక్ చేసిందని చెప్పుకొచ్చింది. అదే సమయంలో..  జ్యూరీ తన జీవితాన్ని తిరిగి ఇచ్చిందని డెప్ తెలిపాడు. ఈ విచారణలో ఏడుగురు వర్జీనియా కోర్డు సభ్యుల జ్యూరీ 2018 లైంగిక హింసపై డెప్‌కి వ్యతిరేకంగా హర్డ్ ఒక కథనాన్ని వ్రాసినట్లు కనుగొంది. దురుద్దేశంతో రాసిన ఈ కథనం డెప్ ప్రతిష్టను దెబ్బతీసిందని తెలిపింది. అందుకే 116 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా.. డెప్ లాయర్ ఆడమ్ వాల్డ్‌మాన్, నటి హర్డ్‌పై కొన్ని కామెంట్స్ చేశారు. అవి ఆమె పరువుకి నష్టం కలిగించాయనే ఉద్దేశంతో హర్డ్‌కి 2 మిలియన్ల డాల్లర్ల పరిహారం ఇప్పించేలా కోర్టు నిర్ణయించింది.


ఈ కేసు తీర్పు తర్వాత అంబర్ హర్డ్ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో.. ‘ఈరోజు నాకు ఎదురైన నిరాశ మాటల్లో చెప్పలేను. ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ.. అవి నా మాజీ భర్త అసమానమైన శక్తి, ప్రభావం ముందు నిలబడలేకపోయాయి. ఇది చూసి నా గుండె పగిలిపోయింది. ఈ తీర్పు ఇతర మహిళలకు తప్పుగా అర్థం అవుతుందనేది నన్ను ఇంకా కుంగదీస్తోంది. ఇది అందరికీ ఎదురుదెబ్బ. తనకు జరిగిన అన్యాయాన్ని మాట్లాడే బహిరంగంగా మహిళను అవమానించేలా ఉన్న ఈ పరిస్థితి వారిని కాలంలో వెనక్కి తీసుకెళ్లేలా ఉన్నాయి. మహిళలపై హింసను సీరియస్‌గా తీసుకోవాలనే ఆలోచనను రాకుండా చేస్తుంది.


డెప్ న్యాయవాదులు తమ తెలివితేటలతో కొన్నింటిని పక్కదారి పట్టించగలిగారు. ప్రజల మాట్లాడే హక్కు గురించి పట్టించుకోకుండా జ్యూరీని మిస్ లీడ్ చేయగలిగారు. యూకేలో మా గెలుపునకు కారణమైన పలు సాక్ష్యాలు ఇక్కడ పనికి రాకుండా పోయాయి. ఈ కేసు ఓడిపోయినందుకు బాధగా ఉంది. కానీ.. దానికంటే ఒక అమెరికన్‌గా స్వేచ్ఛగా, బహిరంగంగా మాట్లాడే హక్కుని కోల్పోయినట్లు అనిపించడం ఇంకా బాధాకరం’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.




మరోవైపు.. ఈ కేసు తీర్పు జానీ డెప్‌ అభిమానులని చాలా సంతోషాన్ని కలిగించింది. దీంతో నటుడికి మద్ధతుగా సోషల్ మీడియా వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు.











Updated Date - 2022-06-02T18:32:01+05:30 IST