Amber Heard : మాజీ భర్త ‘తొలి ముద్దు’, ‘తొలి చెంపదెబ్బ’ గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్న హాలీవుడ్ నటి

ABN , First Publish Date - 2022-05-06T03:14:19+05:30 IST

హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్, యాంబర్ హెర్డ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ ఎక్స్ వైఫ్ అండ్ హజ్బెండ్ ప్రస్తుతం పరువు నష్టం కేసులో భాగంగా కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ తన మాజీ భార్య అయిన యాంబర్ హెర్డ్ పై పరువు నష్టం దావా వేశాడు. ఆమె రాసిన ఓ పత్రికా వ్యాసంలో భాగంగా తనని ఉద్దేశపూర్వకంగా కించపరిచిందని ఆరోపిస్తున్నాడు. తనని ఓ డ్రగ్ ఎడిక్ట్ గా, గృహ హింసకు పాల్పడ్డ వాడిగా, దుర్మార్గుడిగా కావాలని చిత్రీకరించిందని కోర్టు ముందు నివేదించుకున్నాడు. యాంబర్ హెర్డ్ కూడా తానే బాధితురాలని అంటోంది. జానీ డెప్ తనని ఎలా హింసించాడో కోర్టులో పూసగుచ్చినట్టు చెబుతోంది...

అమెరికాలోని ఓ కోర్టులో ప్రస్తుతం కొనసాగుతోన్న విచారణలో భాగంగా హెర్డ్ కంట తడి పెట్టుకుంది. తొలిసారి జానీ తనని ఎలా కొట్టిందీ వివరించింది. అతడు మొదటిసారి కొట్టిన చెంపదెబ్బ తన జీవితాన్నే మార్చేసిందని వ్యాఖ్యానించింది. కేవలం అతడి ఒంటిపై ఉన్న టాటూ గురించి అడిగినందుకు డెప్ తనని కొట్టాడని కోర్టుకు తెలిపింది. ఆ సంగతి తాను మరిచిపోలేననీ... అది తన జీవితాన్నే మార్చేసిందని యాంబర్ అంటోంది...

కోర్టు బోనులో నిల్చున్న హాలీవుడ్ నటి యాంబర్ తన మాజీ భర్త కొట్టిన తొలి చెంప దెబ్బ గురించే కాదు... తొలి ముద్దు గురించి కూడా ప్రస్తావించింది. ‘రమ్ డైరీ’ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరు కలిశారు. తరువాత క్రమంగా ఇద్దరి మధ్యా అగ్గి రాజుకుంది. తెర వెనుక రియల్ రొమాన్స్ మాత్రమే కాదు... తెర మీద కొనసాగిన సినిమా సీన్స్ లోనూ జీవించేశారు. ‘రమ్ డైరీ’లోని ఓ షావర్ సీన్ గురించి చెప్పుకొచ్చిన యాంబర్, ‘‘అది సాధారణమైన సన్నివేశంలా అనిపించలేదు. అది నిజంలా తోచింది’’ అంది! 

‘రమ్ డైరీ’ షూటింగ్ వేళ ప్రేమలో పడ్డ జానీ డెప్, యాంబర్ హెర్డ్ 2015లో పెళ్లాడారు. 2017లో విడాకులు తీసుకున్నారు. కానీ, రెండేళ్ల కాలంలోనే వారిద్దరి మధ్యా తీవ్రమైన సంఘర్షణ జరిగింది. యాంబర్ తన మీద భౌతిక దాడి చేసిందని వీడియోతో సహా ఆధారం చూపాడు డెప్. మరోవైపు, ఎదురు దాడి మొదలు పెట్టిన యాంబర్ కూడా తనని డెప్ చిత్రవధ చేశాడని అంటోంది. తన మర్మాంగంలో వేళ్లు పెట్టి డ్రగ్స్ కోసం వెదికేవాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది! ఆమె ఆరోపణల్ని సమర్థిస్తున్నట్టుగా డాన్ హ్యూగ్స్ అనే క్లినికల్ సైకాలజిస్ట్ కూడా కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. సైకాలజిస్ట్ స్టేట్మెంట్ ప్రకారం... డెప్ తాగి ఉన్నప్పుడు లేదా డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు... అతడు ఆమెని మంచం మీదకి నెట్టేవాడట. నైట్ గౌన్ చించివేసి బలవంతంగా శృంగారం జరిపేందుకు ప్రయత్నించేవాడట. అంతే కాకుండా, యాంబర్ చేత జానీ బలవంతంగా ఓరల్ సెక్స్ చేయించేవాడని కూడా హెర్డ్ తరుఫు సైకాలజిస్ట్ కోర్టులో వ్యాఖ్యానించింది! 

ఎవ్వరూ, ఎప్పుడూ ఊహించని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తోన్న హాలీవుడ్ మాజీ జంట డెప్ అండ్ హెర్డ్ ప్రస్తుతం అమెరికాలోనే కాదు అంతర్జాతీయంగా పెద్ద సంచలనం అయ్యారు! వారి కేసులో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది...  

Updated Date - 2022-05-06T03:14:19+05:30 IST