The Rings Of Power: బిలియన్ డాలర్ల బడ్జెట్.. కానీ డ్రాగన్ దెబ్బకి విలవిల

ABN , First Publish Date - 2022-09-14T22:16:25+05:30 IST

అమెజాన్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన షో ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్’ (Lord of the Rings: The Rings of Power). ఈ సిరీస్‌ను 1బిలియన్ డాలర్స్ భారీ బడ్జెట్‌తో ఆ సంస్థ నిర్మించింది.

The Rings Of Power: బిలియన్ డాలర్ల బడ్జెట్.. కానీ డ్రాగన్ దెబ్బకి విలవిల

అమెజాన్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన షో ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్’ (Lord of the Rings: The Rings of Power).  ఈ సిరీస్‌ను 1బిలియన్ డాలర్స్ భారీ బడ్జెట్‌తో ఆ సంస్థ నిర్మించింది. అమెజాన్‌లో ఈ షో సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సిరీస్ కోసం ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకున్నా కొంత మంది దానిని రద్దు చేసుకున్నారు. క్రిటిక్స్ మాత్రం ఈ షోను మెచ్చుకుంటున్నారు. గతంలో వచ్చిన ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ (Lord of the Rings) ట్రైలాజీని 86 నుంచి 95శాతం వరకు మెచ్చుకుంటే, ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న షోకు 39శాతం మంది మాత్రమే పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. అమెజాన్ సొంతమైన ఐఏమ్‌డీబీ‌లో‌ను ‘ద రింగ్స్ ఆఫ్ పవర్’ కు ప్రేక్షకులు 6.8మాత్రమే రేటింగ్ ఇచ్చారు.    


హెచ్‌బీవో నిర్మించిన ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ (House of the Dragon) ను ఆగస్టు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఐఏమ్‌డీబీలో ఈ షోకు 8.8 మాత్రమే రేటింగ్ వచ్చింది. ‘రింగ్స్ ఆఫ్ పవర్’ కంటే ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ ను 51శాతం మంది ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. ‘రింగ్స్ ఆఫ్ పవర్’ మొదటి రెండు ఎపిసోడ్స్‌ను 31లక్షల కుటుంబాలు వీక్షిస్తే, అదే సమయంలో ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ ను 48లక్షల కుటుంబాలు చూశారు. అయితే, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ కు మంచి ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ కొత్త షో మాత్రం వారిని ఏ మాత్రం ఆకట్టు కోలేకపోతుంది. ‘రింగ్స్ ఆఫ్ పవర్’ షోతో కొత్తగా అనేక మంది ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకుంటారని అమెజాన్ ఆశించింది. అందువల్ల సిరీస్‌ను ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కానీ, షో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఆ సంస్థ కంగుతింది. ప్రేక్షకులు టీవీ షోపై కామెంట్ చేయకుండా రివ్యూస్‌ను అమెజాన్ ప్రైమ్ డిసేబుల్  చేసింది. కొంత మంది ప్రైమ్ సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.

    

రివ్యూస్‌ను డిసేబుల్ చేయడంతో అమెజాన్ ప్రైమ్ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది. నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. దీంతో అమెజాన్ సెప్టెంబర్ 9 నుంచి రివ్యూస్ ను ఎనేబుల్ చేసింది. ఇప్పటికి 1000మంది తమ స్పందనను తెలిపారు. యావరేజ్ రేటింగ్ 3.5 స్టార్స్ వచ్చింది. ఒక ప్రేక్షకుడు ‘లార్డ్ ఆఫ్ ది రంగ్స్’కు వీరాభిమాని. ఆ షోకు అతడు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్‌తో అతడు సంతృప్తి చెందలేదు. దీంతో షోకు ఘోరంగా 0.5స్టార్ మాత్రమే రేటింగ్ ఇచ్చాడు. ‘‘షో హిట్టా, ఫట్టా అని ఇప్పుడే అంచనాకు రావొద్దు. రెండు ఎపిసోడ్స్‌ను మాత్రమే సబ్ స్క్రైబర్స్ వీక్షించి రివ్యూస్ ఇచ్చారు. తర్వాతి ఎపిసోడ్స్ ఇలానే ఉంటాయని భావించలేం. అవి వారిని ఆకట్టుకునే అవకాశం ఉంది’’ అని ఓ ట్రేడ్ పండితుడు చెప్పారు.   


‘ద రింగ్స్ ఆఫ్ పవర్’ స్ట్రీమింగ్ అయ్యిన రోజు 2.5కోట్లకు పైగా ప్రేక్షకులు షోను చూశారు. ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ ను ప్రీమియర్ రోజు 1.2కోట్ల మంది వీక్షించారు. దీంతో అమెజాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. బిగ్గెస్ట్ ప్రీమియర్ అని తెలిపింది. నిజానికి అమెజాన్ ప్రైమ్‌కు 20కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 10శాతం కంటే తక్కువ మంది ఈ ప్రీమియర్‌ను చూశారు. 88శాతం మంది ప్రీమియర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ సిరీస్‌ను వీక్షించాలంటే ఏడాదికి అదనంగా 20డాలర్లు చెల్లించాల్సి ఉండటం కూడా వీక్షణలకు తక్కువ కారణం. 

Updated Date - 2022-09-14T22:16:25+05:30 IST