Sitaramam : ఓటీటీ పార్టనర్ ఎవరంటే.. !

ABN , First Publish Date - 2022-08-06T00:17:31+05:30 IST

మలయాళ హీరో దుల్ఖర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన ఎపిక్ లవ్ స్టోరీ ‘సీతారామం’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్‌లోకి వచ్చింది. సినిమాకి మంచి టాక్ రావడంతో పాటు విమర్శకులు సైతం ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు.

Sitaramam : ఓటీటీ పార్టనర్ ఎవరంటే.. !

మలయాళ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman), మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ఎపిక్ లవ్ స్టోరీ ‘సీతారామం’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై  హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్‌లోకి వచ్చింది. సినిమాకి మంచి టాక్ రావడంతో పాటు విమర్శకులు సైతం ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంతటి పరిపక్వమైన ప్రేమకథ రాలేదని జనం చెబుతున్నారు. ‘మహానటి’ (Mahanati) చిత్రం తర్వాత మరోసారి దుల్ఖర్ డైరెక్ట్ గా నటించిన ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ రివ్యూస్ రావడంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.


ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా విడుదల రోజునే ఓటీటీ పార్టనర్‌ కన్ఫర్మ్ అవడం విశేషమని చెప్పాలి. ముందు నుంచి వార్తలొచ్చినట్టుగా ఈ సినిమా త్వరలో అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime) లో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. అయితే అమెజాన్ ప్రైమ్‌లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నదనే విషయం ఇంకా తెలియదు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు విడుదలవుతుందా, లేక 50 రోజుల తర్వాత వస్తుందా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. వైజయంతి వారి నుంచి అమెజాన్ భారీ ధరకు దీన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 


దుల్ఖర్ సల్మాన్ ఇంతకు ముందు ఇదే బ్యానర్ లో నటించిన ‘మహానటి’ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా థియేటర్స్‌లో మంచి వసూళ్ళను రాబట్టి.. ఆ తర్వాత అమెజాన్ వారికి భారీ ధరకు విక్రయించారు. ఇప్పుడు ‘సీతారామం’ చిత్రం కూడా అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి రానుండడం విశేషంగా మారింది. సీతారామం చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. అక్కడ నుంచి కూడా చిత్రానికి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి.  అలాగే.. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూడు భాషల్లోనూ సినిమా అందుబాటులోకి రాబోతోంది. మరి ఈ సినిమా థియేటర్స్ లో ఎంత వసూళ్ళను రాబడుతుందో.. ఓటీటీలో ఇంకెంతటి ఆదరణ పొందుతుందో చూడాలి. 

Updated Date - 2022-08-06T00:17:31+05:30 IST