Amala Paul: ఆ పాన్ ఇండియాలో అవకాశం వస్తే రిజెక్ట్ చేశానంటున్న అమల.. ఇదే కారణమంటూ..

ABN , First Publish Date - 2022-09-12T22:14:29+05:30 IST

ఓ వైపు స్టార్ హీరోలతో కమర్షియల్ హీరోయిన్‌గా చేస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెట్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న..

Amala Paul: ఆ పాన్ ఇండియాలో అవకాశం వస్తే రిజెక్ట్ చేశానంటున్న అమల.. ఇదే కారణమంటూ..

ఓ వైపు స్టార్ హీరోలతో కమర్షియల్ హీరోయిన్‌గా చేస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెట్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న నటి అమలపాల్. ఈ బ్యూటీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో సినిమాలు చేసి మంచి పాపులారిటీ సాధించింది. ఈ భామ నటించిన తాజా చిత్రం ‘కడవర్’. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ అవకాశం మొదటే తనకే వచ్చిందని తెలిపింది.


అమలా పాల్ మాట్లాడుతూ.. ‘గతంలో ఓసారి పొన్నియిన్ సెల్వన్ కోసం మణిరత్నం సర్ నన్ను ఆడిషన్ చేశారు. అప్పుడు నేను కూడా ఆ సినిమా చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను మణి సర్‌కి వీరాభిమానిని. అందుకే ఆయన కలిసి పని చేసే రోజు కోసం ఎదురు చూశాను. కానీ.. ఏమైందో కానీ ఆసమయంలో ఆ సినిమా పట్టాలెక్కలేదు. దాంతో నేను చాలా నిరాశ చెందాను. ఆ తర్వాత 2021లో అదే ప్రాజెక్ట్ కోసం నన్ను పిలిచాడు. అయితే.. ఆ సమయంలో నా మానసిక స్థితి బాగాలేదు. దాని వల్ల ఆ పాత్రని చేయగలననే నమ్మకం నాకు కలగలేదు. అందుకే ఆ ఆఫర్ తిరస్కరించాను. దాని గురించి ఏదైనా బాధపడుతున్నారా అని అడిగితే కచ్చితంగా లేదనే చెబుతాను. ఎందుకంటే కొన్ని విషయాలు అలాగే జరగాలి. అది అలాగే జరిగింది. అది మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుందని నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చింది.


అలాగే.. సినిమాలకు విరామం తీసుకోవడం గురించి అమల మాట్లాడుతూ.. ‘సినిమాలు ఆడకపోవడం వల్లనో, ఆఫర్లు రాకపోవడం వల్లనో నేను సినిమాలకు విరామం తీసుకోలేదు. ఆ సమయంలో నాకు కెరీర్‌లోనే అతిపెద్ద ఆఫర్లు వచ్చాయి. కానీ.. నేను చాలా అలసిపోయాను. నాకు విరామం చాలా అవసరం. అందుకే వాటన్నింటిని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. 17 సంవత్సరాల వయస్సులో పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు నాకు 30 ఏళ్లు. ఈ పదమూడేళ్లలో విరామం అనేది లేకుండా పని చేశాను. అందుకే బ్రేక్ తీసుకోవాలని, సినిమాలకి కొన్ని రోజులు దూరమయ్యాను’ అని తెలిపింది.

Updated Date - 2022-09-12T22:14:29+05:30 IST