Alluri : ఫస్ట్ వారెంట్ రెడీ !

ABN , First Publish Date - 2022-07-04T17:43:47+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు (Sreevishnu) స్టైలే వేరు. విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలకు అతడు కేరాఫ్ అడ్రెస్. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన శ్రీవిష్ణు.. తాజాగా ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా రాబోతున్నాడు. సినిమా పేరు ‘అల్లూరి’ (Alluri).

Alluri : ఫస్ట్ వారెంట్ రెడీ !

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు (Sreevishnu) స్టైలే వేరు. విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలకు అతడు కేరాఫ్ అడ్రెస్. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన శ్రీవిష్ణు.. తాజాగా ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా రాబోతున్నాడు. సినిమా పేరు ‘అల్లూరి’ (Alluri). ‘నిజాయితీకి మారు పేరు’ ట్యాగ్ లైన్. ఈ సినిమాతో ప్రదీప్ వర్మ (Pradeep Varma) దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.  లక్కీ మీడియా (Lucky Media) బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ (Bekkam Venugopal) ఈ సినిమాను నిర్మి్స్తున్నారు. శ్రీవిష్ణు కెరీర్ లో మొట్టమొదటి పోలీస్ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. నిజాయితీ నిండిన కథతో ఈ సినిమాను రూపొందించనున్నాడు దర్శకుడు. ఈ సినిమాతో పోలీసుల గొప్పతనాన్ని చాటి చెప్పబోతున్నాడట. ఈ క్రమంలో తీవ్రంగా పరిశోధన చేసి పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నాడట దర్శకుడు. శ్రీవిష్ణు  లాంగ్వేజ్, బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా అతడి పాత్రను మలిచినట్టు టాక్. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన మేకర్స్.. ఈ రోజు (జూలై 4) అల్లూరి సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఫస్ట్ వారెంట్ పేరుతో విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పోలీస్ గా శ్రీవిష్ణు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇది వరకు ఇలాంటి పాత్ర చేయకపోవడం వల్ల ఒక ఫ్రెష్ ఫీల్ కలుగుతోంది. ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్.. పోలీస్.. బైలు దేరాడు రా.. విప్లవానికి నాంది, చైతన్యానికి పునాది, నాజాయితీకి మారుపేరు..’ అనే వాయిస్ పై వచ్చే శ్రీవిష్ణు పోలీస్ విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ‘అల్లూరి సీతారామరాజు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్’ అంటూ టీజర్ చివరిలో అతడు పలికే డైలాగ్.. సినిమాలో సమ్ థింగ్ స్పెషల్ ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. కోరమీసంతో పవర్ ఫుల్ అల్లూరిగా శ్రీవిష్ణు ఖచ్చితంగా ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడనిపిస్తోంది.  


కొత్తగా డ్యూటీలోకి చేరిన ఓ పోలీసాఫీసర్.. తన విప్లవాత్మక ఆలోచనలతో మొత్తం డిపార్ట్ మెంట్ లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు? ఉన్నతాధికారుల నుంచి అతడు ఏ విధమైన సవాళ్ళను ఎదుర్కొన్నాడు? నేరస్తుల పట్ల అతడు ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? క్రైమ్ రేట్ ను ఎలా తగ్గించాడు? అనే అంశాల్ని ఈ సినిమాలో సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నాడట దర్శకుడు. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమాకు అతి త్వరలో విడుదల తేదీ ప్రకటించబోతున్నారు.  విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు (Alluri Sitharamaraju) పేరునే తన పేరుగా చేసుకొన్న పోలీస్ గా శ్రీవిష్ణు ఈ సినిమాతో ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-07-04T17:43:47+05:30 IST