Salman కి కాలేదు... తమ్ముళ్లకి నిలవలేదు...

ABN , First Publish Date - 2022-05-13T23:20:46+05:30 IST

సల్మాన్ తెలిసినంత మందికి అతడి తమ్ముళ్లు తెలియకపోవచ్చు. సౌత్ లో అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ తెలిసిన వారు మరింత తక్కువ. అయితే, పెళ్లే చేసుకోని బజ్రంగీ భాయ్ జాన్ కు ఇద్దరు తమ్ముళ్లుండగా వారిద్దరూ చాలా ఏళ్ల కిందటే పెళ్లిల్లు చేసేసుకున్నారు. వారికి వారసులు కూడా ఉన్నారు. అయితే, సంతోషంగా సాగిపోతోన్న సల్మాన్ ఖాన్ తమ్ముళ్ల వైవాహిక జీవితం...

Salman కి కాలేదు... తమ్ముళ్లకి నిలవలేదు...

సినీ ప్రపంచానికి డైవోర్స్ లు కొత్త కాదు. మరీ ముఖ్యంగా, బాలీవుడ్ కి కూడా విడాకుల వ్యవహారాలు కొత్తేం కాదు. అయితే, Salman khan కుటుంబానికి సైతం రెండోసారి డైవోర్స్ ఎఫెక్ట్ తప్పటం లేదు. బాలీవుడ్ భాయ్ జాన్ రెండో తమ్ముడు Sohail Khan కూడా అన్న Arbaaz Khan దారిలోనే ప్రయాణిస్తున్నాడు. భార్యకి బైబై చెప్పేందుకు కోర్టు మెట్లు ఎక్కాడు... 


సల్మాన్ తెలిసినంత మందికి అతడి తమ్ముళ్లు తెలియకపోవచ్చు. సౌత్ లో అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ తెలిసిన వారు మరింత తక్కువ. అయితే, పెళ్లే చేసుకోని బజ్రంగీ భాయ్ జాన్ కు ఇద్దరు తమ్ముళ్లుండగా వారిద్దరూ చాలా ఏళ్ల కిందటే పెళ్లిల్లు చేసేసుకున్నారు. వారికి వారసులు కూడా ఉన్నారు. అయితే, సంతోషంగా సాగిపోతోన్న సల్మాన్ ఖాన్ తమ్ముళ్ల వైవాహిక జీవితం ఒడిదుడుకులకు గురువుతూ వచ్చింది. ఫలితంగా కొన్నేళ్ల క్రితం సల్మాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ భార్య మలైకాకి విడాకులు ఇచ్చాడు. తెలుగులోనూ ‘కెవ్వు కేక’ లాంటి ఐటెం సాంగ్స్ తో పాప్యులర్ అయిన మలైకా డైవోర్స్ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఎందుకంటే, అర్భాజ్ విడాకుల నిర్ణయానికి కారణం మరో బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ కావటమే. మలైకా తనకంటే చాలా చిన్నవాడైన అర్జున్ తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు! 


అర్భాజ్, మలైకా పెళ్లి పెటాకులైన సంగతి సల్మాన్ అభిమానులు మరిచిపోక ముందే ఇప్పుడు ‘ఖాన్’దాన్ లో మరో బ్రేకప్ కి కౌంట్ డౌన్ మొదలైంది. తాజాగా భాయ్ జాన్ చిన్న తమ్ముడు సొహైల్ ఖాన్ ముంబైలోని ఫ్యామిలీ కోర్టు నుంచీ బయటకు వస్తూ కెమెరాల కంట చిక్కాడు. పాపరాజీ కెమెరాలు అతడి భార్య సీమా ఖాన్ ని కూడా క్లిక్ మనిపించాయి. అయితే, సొహైల్, సీమా కలసి కోర్టు నుంచీ బయటకు రాలేదు. వేరువేరుగా వెలుపలికి వచ్చి ఎవరి కార్లో వారు వెళ్లిపోయారు. నిజానికి సొహైల్, అతడి భార్య సీమా గత కొన్ని రోజులుగా విడివిడిగానే ఉంటున్నారు. వారికి 1998లో పెళ్లి కాగా 2000వ సంవత్సరంలో మొదటి కొడుకు, 2011లో సరోగసీ ద్వారా రెండో కొడుకు జన్మించారు. ఢిల్లీకి చెందిన సీమా సచ్ దేవ్ ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ సినిమా టైంలో సొహైల్ తో ప్రేమలో పడింది. తరువాత వారు కొన్నాళ్లు డేటింగ్ చేసి పెళ్లాడారు. సొహైల్ తో పెళ్లికి సీమా కుటుంబ సభ్యులు మొదట ఒప్పుకోలేదు. చివరకు, ప్రేమ జంట పెద్ద వాళ్లకి తెలియకుండానే పెళ్లి చేసుకున్నారు. అయితే, తరువాతి కాలంలో సీమా ఫ్యామిలీ కూడా సొహైల్ ని అంగీకరించింది.


సల్మాన్ ఫ్యామిలీలో అందరి కంటే పెద్ద వాడు మన ‘దబంగ్’ స్టారే. అతడికి అసలు పెళ్లే కాలేదు. రెండో వాడైన అర్భాజ్ మలైకని పెళ్లాడినా 19 ఏళ్ల తరువాత విడాకులు తప్పలేదు. అతడి దారిలోనే నడుస్తూ ఇప్పుడు సీమా ఖాన్ తో సొహైల్ ఖాన్ తన 24 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. సల్మాన్ ఇద్దరు తమ్ముళ్లకు పెళ్లిల్లు అచ్చిరాకపోగా చెల్లెల్లు మాత్రం హ్యాపీలీ మ్యారీడ్ అని చెప్పుకోవాలి. భాయ్ జాన్ పెద్ద చెల్లెలు అల్విరా ఖాన్...అతుల్ అగ్నిహోత్రిని 1996లో పెళ్లాడింది. రెండో చెల్లెలు అర్పితా ఖాన్ పెళ్లి 2014లో ఆయుష్ శర్మతో జరిగింది. 

Updated Date - 2022-05-13T23:20:46+05:30 IST