‘రారా సామి’ అంటూ Spiderman ‘పుష్ప’ జోష్! స్టెప్పులేసిన సూపర్ హీరో...

ABN , First Publish Date - 2022-01-11T22:24:40+05:30 IST

‘పుష్ప’ సినిమా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి సూపర్ కలెక్షన్స్‌తో హిట్ టాక్ స్వంతం చేసుకోగలిగింది. అయితే, యాక్షన్ థ్రిల్లర్‌ మూవీలో ‘రారా సామి’ పాట కూడా దుమ్మురేపింది. సినిమా విడుదలకు ముందు నుంచే జనం నోళ్లలో నానిన డీఎస్‌పి ట్యూన్ తరువాత కూడా పాప్యులర్‌గానే నిలిచింది...

‘రారా సామి’ అంటూ Spiderman ‘పుష్ప’ జోష్! స్టెప్పులేసిన సూపర్ హీరో...

‘పుష్ప’ సినిమా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి సూపర్ కలెక్షన్స్‌తో హిట్ టాక్ స్వంతం చేసుకోగలిగింది. అయితే, యాక్షన్ థ్రిల్లర్‌ మూవీలో ‘రారా సామి’ పాట కూడా దుమ్మురేపింది. సినిమా విడుదలకు ముందు నుంచే జనం నోళ్లలో నానిన డీఎస్‌పి ట్యూన్ తరువాత కూడా పాప్యులర్‌గానే నిలిచింది. అయితే, చాలా మంది అమ్మాయిలు ‘రారా సామి’ అంటూ రశ్మిక స్టెప్పులు ఎగ్జాక్ట్‌గా తాము వేస్తూ సొషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వాళ్లకు ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా తోడయ్యాడు!


పుష్పరాజ్‌గా నటించి అందర్నీ మెస్మరైజ్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. అన్న సక్సెస్‌ని అల్లు శిరీష్ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయనే తన ట్విట్టర్‌లో ‘రారా సామి’ అంటూ డ్యాన్స్ చేస్తోన్న స్పైడర్ మ్యాన్‌ని జనం ముందుకి తెచ్చాడు. ‘‘పుష్ప సినిమాలోని ‘రారా సామి’ పాటకు స్టెప్పులేస్తూ తన సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటోన్న స్పైడర్ మ్యాన్! అల్లు అర్జున్, స్పైడర్‌మ్యాన్... ఇద్దరికీ ఫ్యాన్‌గా ‘వాహ్’ అనకుండా ఉండలేకపోతున్నాను! బాస్, ఇదీ ఇండియా అంటే...’’ అన్నాడు శిరీష్. 


ఇంటర్నెట్‌లో ఇప్పటికే వైరల్‌గా మారిన స్పైడర్ మ్యాన్ ‘సామి సామి’ వీడియో అల్లు శిరీష్ షేర్ చేయటంతో మరింతగా చక్కర్లు కొడుతోంది. అసలు స్పైడర్ మ్యాన్‌గా వేషం వేసిన వ్యక్తి ఎవరు, అతను ఎక్కడ స్టెప్పులేశాడు వంటివేవీ స్పష్టంగా తెలియదు. కాకపోతే, అతను డ్యాన్స్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మోగింది మాత్రం తెలుగు వర్షన్‌లొని పాట కాదు. అయితే, ఇందులో మరో కొసమెరుపు ఏంటంటే... స్పైడర్ మ్యాన్ ‘రారా సామి’ అంటూ ఉత్సాహంగా స్టెప్పులేస్తుంటే... శాంతా క్లాజ్ వేషాల్లో ఉన్న మరికొందరు కూడా అతడికి జత కలిశారు!

Updated Date - 2022-01-11T22:24:40+05:30 IST