Allu Sirish-Anu Emmanuel: ‘ప్రేమ కాదంట’.. మరి ఏంటంట?

ABN , First Publish Date - 2022-09-26T17:10:24+05:30 IST

అనుకున్నదే అయ్యింది.. ఇంతకు ముందు చెప్పుకున్నదే జరిగింది. అల్లు శిరీష్ (Allu Sirish) సినిమాకు సంబంధించి రెండు రోజుల క్రితం మేకర్స్ అధికారికంగా ఓ వార్తను విడుదల చేసిన..

Allu Sirish-Anu Emmanuel: ‘ప్రేమ కాదంట’.. మరి ఏంటంట?

అనుకున్నదే అయ్యింది.. ఇంతకు ముందు చెప్పుకున్నదే జరిగింది. అల్లు శిరీష్ (Allu Sirish) సినిమాకు సంబంధించి రెండు రోజుల క్రితం మేకర్స్ అధికారికంగా ఓ వార్తను విడుదల చేసిన విషయం తెలిసిందే. అల్లు శిరీష్ కొత్త సినిమాకు టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నామని, చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వచ్చిన అనంతరం.. అల్లు శిరీష్ అంతకుముందు చేస్తున్న ‘ప్రేమ కాదంట’ (Prema Kadanta) చిత్రాన్నే మళ్లీ టైటిల్ మార్చి సరికొత్తగా ప్రకటించబోతున్నారనేలా టాక్ నడిచింది. ఇప్పుడదే నిజమైంది. ఇంతకు ముందు ప్రకటించిన ‘ప్రేమ కాదంట’ అనే చిత్రానికే ఇప్పుడు టైటిల్ మార్చి.. నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ కూడా స్పష్టం చేశారు. తాజాగా న్యూ టైటిల్, ఫస్ట్ లుక్‌ను కూడా అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvashivo Rakshashivo) అనే టైటిల్‌ని ఖరారు చేశారు.


అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) నటించిన ఈ చిత్రం.. ‘విజేత’ (Vijetha) సినిమా దర్శకుడు రాకేష్ శశి (Rakesh Sashii) దర్శకత్వంలో తెరకెక్కింది. GA2 పిక్చర్స్ (GA2 Pictures), శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రై.లి. ‌బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఎం సహ నిర్మాత. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుందని.. సినిమాను నవంబర్ 4న విడుదల చేయబోతున్నామని, త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నామని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.


ఇక టైటిల్ మార్చి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్‌ల కెమిస్ట్రీ మాములుగా లేదు. ఇద్దరూ దేనికోసమో సరదాగా గొడవ పడుతున్నట్లుగా ఈ లుక్ ఉంది. ఇందులో అల్లు శిరీష్‌పై కూర్చుని అను.. పోటీ పడుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 29న టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. అచ్చు రాజమణి (Achu Rajamani) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి ‘ప్రేమ కాదంట’ చిత్రానికే ‘ఊర్వశివో రాక్షసివో’గా పేరు మార్చి వస్తున్న ఈ చిత్రం శిరీష్‌కు ఎటువంటి విజయాన్ని ఇస్తుందో తెలియాలంటే నవంబర్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు. (Allu Sirish New Film Title Urvashivo Rakshashivo)



Updated Date - 2022-09-26T17:10:24+05:30 IST