Allu Sirish: ఇది అదేనా?

Twitter IconWatsapp IconFacebook Icon
Allu Sirish: ఇది అదేనా?

మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind), ఐకాన్ స్టార్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందిన అల్లు అర్జున్ (Allu Arjun) వంటి వారి సపోర్ట్ ఉండి కూడా..  అల్లు శిరీష్ (Allu Sirish) బిజీ హీరో కాలేకపోతున్నాడు. ‘గౌరవం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. నటుడిగా మంచి మార్కులే వేయించుకున్న అల్లు శిరీష్.. ఆ తర్వాత ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం’ వంటి విభిన్నమైన కథలతో తెరకెక్కిన సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించాడు. అయినా కూడా హీరోగా ఆయన బిజీ కాలేకపోయాడు. హిట్ రేషియోలో వెనకబడినప్పటికీ.. నటుడిగా అల్లు శిరీష్ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడనేది.. ఆయనని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారిని చూస్తే తెలిసిపోతుంది. అల్లు శిరీష్ చివరిగా నటించిన చిత్రం ‘ABCD‘. ఈ సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. అయినా ఇంత వరకు ఆయన నుండి సినిమా రాలేదు. మధ్యలో అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) హీరోయిన్‌గా ‘ప్రేమ కాదంట’ (Prema Kadanta) అనే చిత్రాన్ని ప్రకటించారు. ఆ సినిమా ఏమైందో తెలియదు. అదలా ఉంటే.. తాజాగా అల్లు శిరీష్ సినిమాకు సంబంధించి ఓ ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. 


ఈ ప్రకటనలో.. గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌లో అల్లు శిరీష్ హీరోగా నటించిన సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ టీజర్ విడుదలకు సంబంధించి.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఫస్ట్ లుక్ విడుదల అనంతరం.. సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా.. తెలిపారు.


అయితే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటున్నారు, అలాగే విడుదల తేదీ కూడా ప్రకటించారు.. అంతా బాగానే ఉంది కానీ.. మళ్లీ టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ విడుదల అంటుంటేనే.. కాస్త డౌట్‌గా ఉంది. ఎందుకంటే, ఆల్రెడీ ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ని ప్రకటించడమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ కూడా విడుదల చేసిన సినిమాకి.. మళ్లీ ఇప్పుడు ఫ్రెష్‌గా ఈ ప్రకటన ఏమిటో అర్థం కావడం లేదు. ఆ సినిమాకే.. సరికొత్త కలరింగ్ ఇవ్వబోతున్నారా? లేక ఇది వేరే సినిమానా? ఏదిఏమైనా ఈ ప్రకటన అనంతరం.. ‘ఇది అదేనా?’ అంటూ కామెంట్స్ వైరల్ అవుతుండటం చూస్తుంటే.. అల్లు శిరీష్ అండ్ టీమ్ బాగానే ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తోంది. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.