Allu Cinema: ఈ సినిమా విడుదల ఎప్పుడో!

ABN , First Publish Date - 2022-09-27T20:20:48+05:30 IST

అల్లు అర్జున్ (Allu Arjun) తమ్ముడు అల్లు శిరీష్ (Allu Sirish) నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి చేసినా, అందులో ఒక సినిమా ఎదో హిట్ అయింది అనిపించుకున్నాడు, కానీ ఇంకా నిలదొక్కుకోలేక పోతున్నాడు.

Allu Cinema: ఈ సినిమా విడుదల ఎప్పుడో!

అల్లు అర్జున్ (Allu Arjun) తమ్ముడు అల్లు శిరీష్ (Allu Sirish) నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి  చేసినా, అందులో ఒక సినిమా ఎదో హిట్ అయింది అనిపించుకున్నాడు, కానీ ఇంకా నిలదొక్కుకోలేక పోతున్నాడు. దానికి తోడు అతని ప్రస్తుత సినిమా విడుదల తేదీ ఎప్పుడో తెలియటమే లేదు, కానీ సినిమా టైటిల్ (Title Change) మాత్రం మారుస్తూనే వున్నారు. ప్రస్తుతం 'ఊర్వశివో రాక్షసీవో' (Urvashivo Rakshashivo) అన్న టైటిల్ అధికారికంగా పెట్టారు. ఇది కూడా ఉంచుతారో, మళ్ళీ మారుస్తారో కూడా తెలియదు. ఈ సినిమా ఎప్పుడో అయిపొయింది అన్నారు, అవలేదు అన్నారు, మంచి డేట్ చూసి విడుదల చేస్తాం అంటున్నారు, ఇంకా ఏదేదో అంటున్నారు కానీ, ఇంతవరకు వివుడల తేదీ (Release date) అయితే మాత్రం ఖరారు (Confirm) కాలేదు. దీనికి 'విజేత' (VIjetha) సినిమా దర్శకుడు రాకేష్ శశి (Rakesh Sasi) దర్శకత్వం (Director) వహిస్తున్నారు. అను ఇమ్మాన్యూల్ (Anu Emmanuel) కథానాయికగా చేసింది. ముందు అనుకున్న టైటిల్ 'ప్రేమకాదంట' (Prema Kadanta), ఇప్పుడేమో 'ఉర్వశివో రాక్షసివో' అని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టీజర్ (Teaser) ను సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు చిత్ర నిర్వాహకులు. శిరీష్ చివరి సినిమా 'ఎబిసిడి' (ABCD) మూడేళ్ళ క్రితం విడుదల అయింది, అలాగే పోయింది కూడా. శిరీష్ నటుడిగా కొనసాగడానికి ఇప్పుడు ఈ 'ఉర్వశివో రాక్షసివో' సినిమా ఫలితం మీద చాల ఆధారపడి వుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్స్ కి రావటం లేదు, సినిమాలో అదిరిపోయే కంటెంట్ ఉండాలి. ఇవన్నీ లేవంటే డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చెయ్యటమే. 


Updated Date - 2022-09-27T20:20:48+05:30 IST