ఎప్పటికప్పుడు.. ఏ విషయంలోనూ.. ‘తగ్గేదేలే’... బన్నీ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన పర్సనల్ స్టైలిస్ట్!

ABN , First Publish Date - 2022-02-04T01:30:09+05:30 IST

సినిమాల్లో భిన్న పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు అల్లు అర్జున్. ప్రతి సినిమాలో తనదైన స్టైల్‌తో అభిమానులను అలరిస్తుంటాడు

ఎప్పటికప్పుడు.. ఏ విషయంలోనూ.. ‘తగ్గేదేలే’... బన్నీ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన పర్సనల్ స్టైలిస్ట్!

సినిమాల్లో భిన్న పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు అల్లు అర్జున్. ప్రతి సినిమాలో తనదైన స్టైల్‌తో అభిమానులను అలరిస్తుంటాడు. ‘పుష్ప : ది రైజ్’ చిత్రంలో అతడి లుక్స్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలోని అతడి డ్రెస్సింగ్ స్టైల్, మేనరిజమ్స్‌కు అందరు ఫిదా అయ్యారు. బన్నీ పర్సనల్ స్టైలిస్ట్ హార్మన్ కౌర్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అభిమానులతో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడానికి బన్నీ పరితపిస్తాడని, అందుకోసం ప్రతి నిమిషం కష్టపడతాడని ఆమె చెప్పింది. 


రియల్ లైఫ్‌లోని క్యారెక్టర్స్ కాకుండా స్క్రీన్ మీద నటులు కొత్తగా కనిపించాలి. అందుకే ప్రతి మూవీలో లుక్స్‌పై వారు దృష్టి సారిస్తారు. గత కొన్నేళ్లుగా ఐకాన్ స్టార్ ప్రతి చిత్రంలో కొత్తగా కనిపిస్తున్నాడు. మేకప్, జట్టు, గడ్డం తదితరాలపై దృష్టి సారించి అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాడు. సినిమాలోని పాత్ర పోషించే ముందు రియల్ లైఫ్‌లో దగ్గరగా ఉండే వ్యక్తులను అతడు రిఫరెన్స్‌గా తీసుకుంటాడట. వారి హావభావాలను తెర మీదకు తీసుకు వచ్చేందుకు సినిమా షూటింగ్ ముగిసే వరకు ప్రయత్నిస్తాడని హార్మన్ కౌర్ చెప్పింది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కష్టపడాలని వివరించింది. అందు కోసం బన్నీ ప్రతి నిత్యం ఆలోచిస్తుంటారని అందుకే ఆ స్థాయిలో ఉన్నారని స్పష్టం చేసింది. ‘‘ఏ పాత్ర పోషిస్తున్నా సరే తెర మీద దానిని చూపించడానికి నిస్సంకోచంగా చాలా కష్టపడతాడు. ఆ కష్టం అంతా ఆ పాత్రలో కనిపిస్తుంది. స్టైలిష్ స్టార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మొదట క్రాఫ్ట్‌లో నైపుణ్యం పెంచుకోమని నాకు సలహా ఇచ్చాడు. ఆ సలహా అద్భుతంగా పనిచేసింది’’ అని హార్మన్ కౌర్ వెల్లడించింది.

Updated Date - 2022-02-04T01:30:09+05:30 IST