Allu Arjun: సల్మాన్ ఖాన్‌తో సమానంగా బన్నీ రెమ్యూనరేషన్

ABN , First Publish Date - 2022-09-08T00:15:18+05:30 IST

ప్రతి సినిమాలోను వైవిధ్యం చూపించే నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’

Allu Arjun: సల్మాన్ ఖాన్‌తో సమానంగా బన్నీ రెమ్యూనరేషన్

ప్రతి సినిమాలోను వైవిధ్యం చూపించే నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘పుష్ప’ (Pushpa). లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియాగా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఎటువంటి ప్రమోషన్ చేయకుండా హిందీ మార్కెట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయగా రూ. 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ‘పుష్ప’ మంచి విజయం సాధించడంతో రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule) పై భారీ బజ్ ఏర్పడింది. దీంతో మేకర్స్ అందరి అంచనాలకు తగ్గట్టుగా చిత్రాన్ని  నిర్మించాలనుకుంటున్నారు. అందుకోసం భారీ బడ్జెట్‌ను వెచ్చిస్తున్నారు. రెమ్యూనరేషన్ రూపంలోను బన్నీకి భారీగా చెల్లిస్తున్నారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి.     


‘పుష్ప: 2’ (Pushpa 2)ను రూ. 450కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్‌‌ రెమ్యూనరేషన్ రూపంలో రూ. 125కోట్లను తీసుకుంటున్నాడట. ఈ చిత్రంలో సాయిపల్లవి (Sai Pallavi) కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందట. గిరిజన యువతి పాత్రను ఆమె పోషించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ‘పుష్ప’ లో రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, ధనుంజయ, రావు రమేష్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ మాత్రమే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడు. సాజిద్ నడియడ్ వాలా నిర్మిస్తున్న ‘కీసీ కా భాయ్ కీసీ కీ జాన్’ కు రూ. 125కోట్లను పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. 


Updated Date - 2022-09-08T00:15:18+05:30 IST