Pushpa 2 లో శ్రీవల్లి పాత్ర చనిపోతుందా..? ఆ సినిమాతో పోల్చుతూ నెట్టింట చర్చ..!

ABN , First Publish Date - 2022-06-20T23:52:02+05:30 IST

స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’’(Pushpa: The Rise). ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో కనిపించారు. భన్వర్ సింగ్ షెకావత్ (Bhanwar Singh

Pushpa 2 లో శ్రీవల్లి పాత్ర చనిపోతుందా..? ఆ సినిమాతో పోల్చుతూ నెట్టింట చర్చ..!

స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’’(Pushpa: The Rise). బన్నీ ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో కనిపించారు. భన్వర్ సింగ్ షెకావత్ (Bhanwar Singh Shekawath) పాత్రను ఫహద్ ఫాజిల్ పోషించారు. లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) తెరకెక్కించారు. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా శ్రీవల్లీ పాత్రలో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోను ఈ మూవీని విడుదల చేశారు. ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద బారీ విజయం సాధించింది. బాలీవుడ్‌లో రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఫలితంగా రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ ను భారీ ఎత్తున రూపొందించాలని మేకర్స్ ప్రణాళికలు రచించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీకి  సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.


‘పుష్ప-2’ లో శ్రీవల్లీ పాత్రను చంపేస్తారని నెట్టింట పుకార్లు షికార్లు కొడుతున్నాయి. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ (Bhanwar Singh Shekawath) పాత్రల్లో ఒక దానిని చంపేస్తారని కొందరు పేర్కొంటున్నారు. భన్వర్ సింగ్ షెకావత్ హీరోయిన్ శ్రీవల్లీని చెంపేస్తారని, అనంతరం పుష్పరాజ్, భన్వర్ సింగ్‌పై ప్రతీకారం తీర్చకుంటారని మరికొందరు పేర్కొంటున్నారు. హీరోయిన్‌ను విలన్ చంపితే, విలన్ మీద హీరో ప్రతీకారం తీర్చుకునే కాన్సెప్ట్‌ను ‘కెజియఫ్ -2’ లో ఫాలో అయ్యారు. అందువల్ల ‘పుష్ప-2’ ను కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ ‘కెజియఫ్-2’తో పోల్చుతున్నారు. ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ గతంలోనే ప్రారంభం కావాలి. కానీ, మొదటి భాగం భారీ విజయం సాధించడంతో, రెండో భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించాలని సుకుమార్ అనుకున్నారు. అందువల్ల స్క్రిఫ్ట్‌‌కు మెరుగులద్దే పనిలో ఉన్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2022-06-20T23:52:02+05:30 IST