ఇది నేను చేస్తున్న ఫేవ‌ర్ కాదు.. నా బాధ్య‌త‌: అల్లు అర్జున్

ABN , First Publish Date - 2022-01-11T03:07:37+05:30 IST

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వ‌స్తున్న సినిమాల‌న్నీ బాగున్నాయి. అఖండ‌, మా పుష్ప సినిమాలు వ‌చ్చాయి. అలాగే నానిగారి శ్యామ్ సింగ‌రాయ్ కూడా పెద్ద స‌క్సెస్ అయ్యింది. నాకు ఆ టీమ్‌కు అభినందనలు తెలపడానికి సమయం కుద‌ర‌లేదు. ఇప్ప‌డు చెబుతున్నాను. నానిగారు స‌హా..

ఇది నేను చేస్తున్న ఫేవ‌ర్ కాదు.. నా బాధ్య‌త‌: అల్లు అర్జున్

శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ చిత్రంతో ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు) హీరోగా పరిచయం అవుతున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రొమోషన్‌లో భాగంగా సోమ‌వారం ఈ చిత్రంలోని ‘డేట్ నైట్..’ అనే సాంగ్‌ను విడుద‌ల చేసేందుకు ఓ వేడుకను నిర్వహించారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సాంగ్‌ను విడుద‌ల చేశారు. 


సాంగ్ విడుదల అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫంక్ష‌న్ నాకెంతో స్వీట్‌. నా జీవితంలో ఆర్య సినిమా ఎంతో ముఖ్య‌మైంది. సుకుమార్‌గారు లేక‌పోతే ఆర్య సినిమా ఎలా లేదో.. దిల్ రాజుగారు కూడా లేక‌పోతే ఆర్య సినిమా లేదు. ఆ సినిమా షూటింగ్ చేసేట‌ప్పుడు.. ఆశిష్‌, అన్షు, హ‌ర్షిత్ అంద‌రూ చిన్న పిల్ల‌లు. షూటింగ్ స‌మ‌యంలో ప‌క్క‌న కూర్చునేవాళ్లు. నేను అప్పుడు వాళ్లు ఇంత స‌క్సెస్‌ఫుల్ ప‌ర్స‌న్స్ అవుతార‌ని అనుకోలేదు. ఇప్పుడు చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఫంక్ష‌న్‌కి రావ‌డం నేను చేస్తున్న ఫేవ‌ర్ కాదు. నా బాధ్య‌త‌. డేట్ సాంగ్ చాలా బావుంది. చూస్తుంటే ఫిబ్ర‌వ‌రి 14న రావాల్సిన సినిమాను జ‌న‌వ‌రి 14నే రిలీజ్ చేస్తున్న‌ట్లు అనిపిస్తుంది. రౌడీ బాయ్స్‌ ఎంటైర్ టీమ్‌కి అభినంద‌న‌లు. ఆశిష్ చాలా బాగా స్టెప్పులేశాడు. జ‌న‌వ‌రి 14న ఈ సినిమా వ‌స్తుంది. ఆల్ ది బెస్ట్‌. 


ఇదే సంద‌ర్భంలో కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వ‌స్తున్న సినిమాల‌న్నీ బాగున్నాయి. అఖండ‌, మా పుష్ప సినిమాలు వ‌చ్చాయి. అలాగే నానిగారి శ్యామ్ సింగ‌రాయ్ కూడా పెద్ద స‌క్సెస్ అయ్యింది. నాకు ఆ టీమ్‌కు అభినందనలు తెలపడానికి సమయం కుద‌ర‌లేదు. ఇప్ప‌డు చెబుతున్నాను. నానిగారు స‌హా టీమ్ అంద‌రూ అద్భుతంగా చేశారు. డైరెక్ట‌ర్ సినిమాను హ్యాండిల్ చేసిన తీరు బాగుంది. శ్యామ్ సింగ‌రాయ్ చాలా బాగుంది. సంక్రాంతికి చాలా సినిమాలు వ‌స్తున్నాయి. తెలుగు సినిమాలు గెల‌వాల్సిన స‌మ‌య‌మిది. అన్నీ సినిమాలు స‌క్సెస్ కావాలి’’ అన్నారు.

Updated Date - 2022-01-11T03:07:37+05:30 IST