‘పుష్ప’ ట్రైలర్: నీయవ్వా.. తగ్గేదే లే

ABN , First Publish Date - 2021-12-07T03:25:36+05:30 IST

భూ మండలంలో యాడా పెరగని సెట్టు.. మన శేషాచలం అడవుల్లో దొరుకుతున్నాది..’ అంటూ అజయ్ ఘోష్ వాయిస్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో ఎర్రచందనం అంటే భూమిపై పెరిగే బంగారం అని చెబుతూ.. స్మగ్లింగ్ ఎలా అవుతుందో చూపించారు. బాస్‌గా..

‘పుష్ప’ ట్రైలర్: నీయవ్వా.. తగ్గేదే లే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ట్రైలర్ వచ్చేసింది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 17న మొదటి పార్ట్ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రొమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. అస్సలు అల్లు అర్జున్ ఏ విషయంలోనూ తగ్గడం లేదనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ.. మళ్లీ అలాంటి హిట్టే బాక్సాఫీస్‌కి ఇవ్వబోతున్నాడనేది ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.


ట్రైలర్ విషయానికి వస్తే.. 

‘భూ మండలంలో యాడా పెరగని సెట్టు.. మన శేషాచలం అడవుల్లో దొరుకుతున్నాది..’ అంటూ అజయ్ ఘోష్ వాయిస్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో ఎర్రచందనం అంటే భూమిపై పెరిగే బంగారం అని చెబుతూ.. స్మగ్లింగ్ ఎలా అవుతుందో చూపించారు. బాస్‌గా ఆ స్మగ్లింగ్ చేస్తుంది పుష్ప రాజే అన్నట్లుగా బన్నీ లుక్ రివీల్ చేశారు. ఆ తర్వాత రష్మికతో పుష్పరాజ్ కెమిస్ట్రీని, రష్మిక పాత్రని పరిచయం చేశారు. వెంటనే సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లి.. రావు రమేష్, అనసూయ, సునీల్, ధనుంజయ్ పాత్రలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో క్లారిటీ ఇచ్చేశారు. ‘ఈ లోకం మీకు తుపాకిచ్చింది. నాకు గొడ్డలిచ్చింది.. ఎవొడి యుద్ధం వాడిదే..’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్, ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్.. వెంటనే ‘పుష్ఫ.. పుష్ఫరాజ్.. నీయవ్వా తగ్గేదే లే..’ అనే డైలాగ్‌తో పాటు గూడ పైకిత్తి పుష్పరాజ్ నడిచే విధానం, ఆ తర్వాత వచ్చే సీన్స్.. ఇది మాములు సినిమా కాదని చెప్పేస్తున్నాయి. ఇదే విషయం ఆ వెంటనే ‘పుష్ప అంటే ప్లవర్ అనుకుంటున్నావా.. ఫైర్’ అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌తో క్లియర్ చేసేశారు. లాస్ట్‌లో ‘పార్టీ లేదా పుష్పా’ అంటూ ఫహాద్ ఫాజిల్ పాత్రతో అభిమానులకు పార్టీకి రెడీ అయిపోవచ్చు అనేలా హింట్ ఇచ్చేశారు. ఓవరాల్‌గా డిసెంబర్ 17న ‘పుష్ప’ జాతర తగ్గేదే లే అన్నట్లుగా ఉండబోతుందనేది చాలా క్లారిటీగా ఈ ట్రైలర్‌తో తెలియచెప్పారు. 



Updated Date - 2021-12-07T03:25:36+05:30 IST