Pushpa: మాస్కోలో అల్లు అర్జున్ ‘పుష్ప’

ABN , First Publish Date - 2022-09-20T18:14:49+05:30 IST

పుష్ప (Pushpa) సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun) ఖ్యాతి ఖండాంతరాలకు కూడా వ్యాపిస్తోంది. ఆ సినిమా ఇంకా ఒక ప్రభంజనంలా..

Pushpa: మాస్కోలో అల్లు అర్జున్ ‘పుష్ప’

పుష్ప (Pushpa) సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun) ఖ్యాతి ఖండాంతరాలకు కూడా వ్యాపిస్తోంది. ఆ సినిమా ఇంకా ఒక ప్రభంజనంలా ప్రపంచం (World) అంతటా తిరుగుతోంది. ‘పుష్ప’ అనే సినిమా గత సంవత్సరం విడుదలై భారతదేశంలో పెద్ద హిట్ అవ్వటమే కాకుండా.. అందులో అల్లు అర్జున్ వాడిన ఊతపదం ‘తగ్గేదే లే’ అందరి నోటా ఒక నానుడి అయిపొయింది కూడా కదా.


అలాంటి ‘పుష్ప’ని ఇప్పుడు మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (Moscow International Film Festival)లో ప్రదర్శించారు. ప్రపంచంలో హిట్ అయిన సినిమాలు అనే కేటగిరి (blockbuster hits around the world)లో పుష్పని ప్రదర్శించారు. ఇది ఒక్క అల్లు అర్జున్, సుకుమార్ (Sukumar)లకే కాదు తెలుగు వాళ్లు అందరూ గర్వించదగ్గ విషయం. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ‘పుష్ప 2 (Pushpa part two)’ షూటింగ్ మొదలెట్టాలి ఇంకా. పుష్ప మొదటి పార్ట్‌కి వచ్చిన ఆ అఖండ ఖ్యాతి పుష్ప రెండో పార్టుకి ఎంతో దోహదం చేస్తుంది. అల్లు అర్జున్ అనే నటుడి పేరు ఇప్పుడు ప్రపంచం అంతటా మారుమోగుతోంది. అతను ఇప్పుడు దానికి తగ్గట్టుగా రెండో పార్టులో కూడా అదే నటన కొనసాగించాలి. అందుకే ఈ రెండో పార్టు కోసం బడ్జెట్ (Budget) కూడా చాలా ఎక్కువ పెడుతున్నట్టు భోగట్టా.

Updated Date - 2022-09-20T18:14:49+05:30 IST