Bimbisara : చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు

ABN , First Publish Date - 2022-08-07T18:56:31+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కొత్త దర్శకులు మల్లిడి వశిష్ట మలిచిన సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. రెండు రోజుల క్రితం థియేటర్స్‌కు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది.

Bimbisara : చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కొత్త దర్శకులు మల్లిడి వశిష్ట మలిచిన సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. రెండు రోజుల క్రితం థియేటర్స్‌కు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో చిత్ర బృందం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరో కళ్యాణ్ రామ్ సైతం చిత్రానికి మంచి విజయం అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. గతాన్ని, వర్తమానాన్ని ముడివేస్తూ దర్శకుడు రాసుకున్న ఈ టైమ్ ట్రావెలింగ్ థ్రిల్లింగ్ కథాంశం ప్రేక్షకుల్ని అబ్బుర పరుస్తోంది. అద్భుతమైన సిజీ వర్క్‌తో, ఖర్చుకు వెనుకాడకుండా.. విజువల్ గ్రాండియర్‌‌గా కళ్యాణ్ రామ్ చిత్రాన్ని నిర్మించడం అభినందనీయం. 


కొంతకాలంగా సరైన హిట్స్ లేని కళ్యాణ్ రామ్.. ఎలాగైనా మంచి సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలనుకున్నాడు. ఆ క్రమంలో, కేవలం కథను, దర్శకుడ్ని నమ్ముకొని ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా.. ‘బింబిసార’ చిత్రాన్ని నిర్మించాడు. ఒక విధంగా ఇది అతడి డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ నమ్మకాన్ని ఏమాత్రం వమ్ముచేయకుండా.. దర్శకుడు వశిష్ట అద్భుతమైన చిత్రంతో కళ్యాణ్ రామ్‌ను తిరిగి సూపర్ ఫామ్ లోకి తీసుకొచ్చాడు. అలాంటి ఈ సినిమాని ఇటీవల వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు  అర్జున్.. ‘బింబిసార’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు.


‘బింబిసార’ చిత్ర బృందానికి గొప్ప అభినందనలు. చాలా ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రంతో అద్భుతమైన స్ర్కీన్ ప్రెజెన్స్‌తో కళ్యాణ్ రామ్ అదరగొట్టారు. ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, కొత్త తరహా చిత్రాల్ని ప్రయత్నిస్తున్నందుకు ఆయనపై గౌరవ కలుగుతోంది’.. అంటూ అల్లూ అర్జున్ చేసిన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, lనాగార్జున, యన్టీఆర్, రామ్ పోతినేని, లాంటి స్టార్స్ ఈ సినిమాని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేయగా.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం. 









Updated Date - 2022-08-07T18:56:31+05:30 IST