Allu Arjun: బాలీవుడ్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్.. ఓ సినిమా ఆఫర్‌ వచ్చినా రిజెక్ట్ చేశానంటూ..

ABN , First Publish Date - 2022-07-18T20:47:10+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, అల్లు వారి వారసుడిగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్...

Allu Arjun: బాలీవుడ్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్.. ఓ సినిమా ఆఫర్‌ వచ్చినా రిజెక్ట్ చేశానంటూ..

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, అల్లు వారి వారసుడిగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ఈ యంగ్ హీరో నటనతోపాటు డ్రెస్సింగ్ స్టైల్‌కి, డ్యాన్స్‌లకి  బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ యంగ్ హీరో దువ్వాడ జగన్నాథం (DJ), లక్కీ ది రేసర్, ఆర్య, సరైనోడు వంటి డబ్బింగ్ చిత్రాలతో సౌతిండియా వ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా కేరళలో అయితే ఈయనకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే బన్నిని అక్కడ మల్లు అర్జున్ అని పిలుచుకుంటూ ఉంటారు మాలీవుడ్ అభిమానులు. అంతేకాకుండా.. నార్త్ ఇండియా ప్రేక్షకులకి సైతం పరిచయస్తుడే. ఈ తరుణంలో గతేడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పుష్ప: ది రైజ్’ (Puhpa: The Rise) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి సక్సెస్‌ని సాధించింది. దీంతో ఈ నటుడు ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. మొదటి భాగం సూపర్ హిట్ సాధించడంతో సెకండ్ పార్ట్ ‘పుష్ప: ది రూల్’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ హిందీ సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


అర్జున్ మాట్లాడుతూ.. ‘హిందీలో నటించడం నాకు కంఫర్ట్‌గా అనిపించదు. అయినప్పటికీ అవసరం అనుకుంటే కచ్చితంగా చేస్తాను. పూర్తిగా ఇన్‌వాల్వ్ అవుతాను’ అని చెప్పుకొచ్చాడు. ఆయన సినిమా ఆఫర్ గురించి మాట్లాడుతూ.. ‘నాకు హిందీ సినిమా ఆఫర్ వచ్చింది. కథ ఏమాత్రం ఆసక్తికరంగా లేకుండా చాలా సాదాసీదాగా ఉంది. అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నా. మంచి కథ వస్తే త్వరలో చేస్తాననే అనుకుంటున్నా. అయితే.. అక్కడ చేయడానికి చాలా ధైర్యం కావాలి’ అని తెలిపాడు. అయితే.. గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ ‘పుష్ప: ది రైజ్’ 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఈ మూవీలో నటించిన హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నకి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ మూవీలోని ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్’ వంటి పలు డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ సైతం అయ్యాయి.

Updated Date - 2022-07-18T20:47:10+05:30 IST