Allu arjun : బన్నీ లైనప్‌ ఇదే..

ABN , First Publish Date - 2022-07-04T22:51:38+05:30 IST

ప్రస్తుతం బన్నీ ‘పుష్ప– 2’ పనుల్లో ఉన్నారు. అయితే బన్నీ తదుపరి చిత్రం ఏంటనే దానిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. దీనిపై ఆయన స్నేహితుడు బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. ‘‘బన్నీ పుష్ప2’ బిజీలో ఉన్నప్పటికీ కథలు వింటున్నారు. వినగావినగా ఆయనకు ఎక్కడో ఒక క్యారెక్టర్‌ను పట్టుకుని దాన్ని లాక్‌ చేస్తారు. ప్రస్తుతం మూడు కథలు వింటున్నారు. నెక్ట్స్‌ ఏంటి అనేది ఆయన చేతుల్లోనే ఉంది.

Allu arjun : బన్నీ లైనప్‌ ఇదే..

ప్రస్తుతం బన్నీ ‘పుష్ప– 2’ (Pushpa 2)పనుల్లో ఉన్నారు. అయితే బన్నీ తదుపరి చిత్రం ఏంటనే దానిపై  ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. దీనిపై ఆయన స్నేహితుడు బన్నీ వాసు (bunny vasu)క్లారిటీ ఇచ్చారు. ‘‘బన్నీ పుష్ప2’ బిజీలో ఉన్నప్పటికీ కథలు వింటున్నారు. వినగావినగా ఆయనకు ఎక్కడో ఒక క్యారెక్టర్‌ను పట్టుకుని దాన్ని లాక్‌ చేస్తారు. ప్రస్తుతం మూడు కథలు వింటున్నారు. నెక్ట్స్‌ ఏంటి అనేది ఆయన చేతుల్లోనే ఉంది. మామూలుగా అయితే ‘పుష్ప’ తర్వాత బోయపాటి శ్రీను చిత్రం అనుకున్నాం. అనుకోకుండా ‘పుష్ప’ రెండు భాగాలు కావడంతో ఆ సినిమా డిలే అయింది. ఆ కథ మీద వర్క్‌ అయితే జరుగుతోంది. మళ్లీ షెడ్యూళ్లు వేసుకుని ఆ సినిమా ప్రారంభిస్తాం. నా అభిమాన దర్శకుడు త్రివిక్రమ్‌గారితో (Trivikram) కూడా బన్నీ సినిమా ఉంటుంది. మహేశ్‌ (Maheshbabu)సినిమా తర్వాత బన్నీతో చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. ఇప్పటికే త్రివిక్రమ్‌గారి ముందు నా ఆలోచన ఉంచాను. ఏం జరుగుతుందనేది చూడాలి. బన్నీతో సినిమా తీసే అవకాశం నా సంస్థ జీఎ2కు వసే..్త అది గీతా ఆర్ట్స్‌ సంస్థకే ఇచ్చేస్తాను. ఎందుకంటే చిరంజీవి, రామ్‌చరణ్‌, బన్నీ సినిమాలు మా పెద్ద సంస్థలోనే తీయాలని, సమర్పకులు అల్లు రామలింగయ్యగారికి ఆ గౌరవం ఇవ్వాలని అనుకుంటాం’’ అని బన్నీ (Allu arjun lineup)లైనప్‌ గురించి చెప్పారు బన్నీ వాసు.



ఇకపై అప్‌ టు డేట్‌...

‘అల వైకుంఠపురములో’ తర్వాత కాస్త స్లో అయ్యాం. కరోనా వల్ల సినిమాలు డిలే కావడంతో హిట్‌ల విషయంలో కాస్త వెనకున్నాం. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌ అనుబంధం సంస్థ జీఎ2లో ఆరు చిత్రాలు విడుదల సిద్ధంగా ఉన్నాయి. అయిత ఇవన్నీ 2019లో సెట్స్‌ మీదకు వెళ్లాయి. కరోనా వల్ల ఇంటికే పరిమితమైన ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్‌తో ప్రపంచ సినిమాల్ని చూసేశారు. మూడేళ్ల క్రితం కథల్ని ఇప్పుడు ఎలా రిసీవ్‌ చేసుకుంటారనే విషయంలో కాస్త డైలామాలో ఉన్నాం. అయితే ఇప్పుడు సెట్స్‌ మీద ఉండి.. 2023లో విడుదలయ్యే చిత్రాలన్నీ అప్‌డేట్‌ కంటెంట్‌తో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ‘18 పేజెస్‌’ చిత్రాన్ని సెప్టెంబర్‌ 10న విడుదల అనుకున్నాం. ‘బ్రహ్మాస్త్ర’ కూడా అదే రోజున ప్రకటించారు కాబట్టి వారం అటుఇటుగా విడుదల చేస్తాం. ‘కిరణ్‌ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ను దసరాకు విడుదల చేద్దామనుకుంటున్నాం"  బన్నీ వాసు చెప్పారు.


Updated Date - 2022-07-04T22:51:38+05:30 IST