Allu arjun: బన్నీ నెక్స్ట్ అతనితోనే!

ABN , First Publish Date - 2022-09-19T22:53:56+05:30 IST

అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప రెండో పార్ట్ (Pusha-2) సినిమాతో బిజీ గా వున్నాడు. ఆ సినిమా అయ్యాక అతను ఎవరితో చేస్తాడు అన్నది చాలామందికి ఆసక్తికరంగా ఉంది.

Allu arjun: బన్నీ నెక్స్ట్ అతనితోనే!

అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప రెండో పార్ట్ (Pusha-2) సినిమాతో బిజీ గా వున్నాడు. ఆ సినిమా అయ్యాక అతను ఎవరితో చేస్తాడు అన్నది చాలామందికి  ఆసక్తికరంగా ఉంది. అందిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ చందు మొండేటి (Chandu Mondeti) తో సినిమా చేయొచ్చు అని తెలిసింది. చందు కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో మంచి సక్సెస్ లో వున్నాడు. ఇది ఒక్క తెలుగు లోనే కాకుండా, హిందీ (Hindi) లో కూడా బ్రహ్మాండంగా ఆడింది, ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం చందు మొండేటి ని పిలిపించుకొని ఒక మంచి కథ తయారుచెయ్యమని చెప్పాడు అని తెలిసింది. పుష్ప 2 కంప్లీట్ కావడానికి ఇంకా చాల టైం  ఉందని,ఈలోపు మంచి కథ చూసి స్క్రిప్ట్ కూడా పూర్తిగా రాసి తీసుకువస్తే బాగుంటుంది అని చందూ కి అర్జున్ చెప్పినట్టు బోగట్టా. చందూ కూడా ఈలోపు ఏదైనా ఒక సినిమా చేయొచ్చు, లేదా అల్లు అర్జున్ ఇచ్చిన ఆఫర్ వాళ్ళ అతని కోసం కథ ఏదైనా రాసుకొని ఉండిపోవచ్చు అని కూడా తెలిసింది. ఏమైనా అల్లు అర్జున్ టాలెంట్ దర్శకులని బాగానే పట్టుకుంటున్నాడు. అంటే తన తదుపరి సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అర్జున్ చేస్తున్నాడు అని అర్థం అవుతోంది. 

Updated Date - 2022-09-19T22:53:56+05:30 IST