Grand Marshal: మహేష్ ‘నో’ అంటేనే.. బన్నీకి ఆహ్వానం!

ABN , First Publish Date - 2022-08-27T22:57:26+05:30 IST

మొన్నామధ్య అమెరికాలో న్యూయార్క్‌లో జరిగిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) పాల్గొన్నాడు. కానీ, అల్లు అర్జున్ కన్నా ముందు ఇదే ఈవెంట్‌లో

Grand Marshal: మహేష్ ‘నో’ అంటేనే.. బన్నీకి ఆహ్వానం!

మొన్నామధ్య అమెరికాలో న్యూయార్క్‌లో జరిగిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) పాల్గొన్నాడు.  కానీ, అల్లు అర్జున్ కన్నా ముందు ఇదే ఈవెంట్‌లో పాల్గొనటానికి మహేష్ బాబు (Mahesh Babu)ని అడిగినట్టు సమాచారం. ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ తమ ప్రారంభ చిత్రం మహేష్‌తో తీశారు. ప్రవాసాంధ్రులైన ఆ నిర్మాతలకి అక్కడ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‏లకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ వాళ్ళతో సత్సంబంధాలు వున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళని అప్రోచ్ అయి- అక్కడ జరగనున్న భారత స్వాతంత్ర్య దిన వజ్రోత్సవ వేడుకలకు మహేష్ బాబును అతిథిగా రప్పించమని అడిగారట. మహేష్ హాజరు సాధ్యాసాధ్యాల గురించి చర్చ జరిగింది. నిర్మాత నవీన్ (Naveen) ముందుగా మహేష్ బాబుని కలిసి ఈ ఈవెంట్‌కి ఆహ్వానించాడట. అయితే, తాను అమెరికా (USA) నుండి కొద్ది రోజుల క్రితమే తిరిగి వచ్చానని, అందువల్ల రాలేననీ మహేష్ చెప్పాడట. దాంతో ఆ నిర్మాత అల్లు అర్జున్ పేరు ప్రస్తావించి, నిర్వాహకులను ఒప్పించాడట. 


మహేష్ ‘నో’ చెప్పిన తర్వాత.. అల్లు అర్జున్‌ని నవీన్ కలిసి కార్యక్రమం గురించి చెప్పడం, ఆయన వెంటనే అంగీకరించడం చకచకా జరిగిపోయాయట. న్యూయార్క్ నగరంలో అట్టహాసంగా జరిగిన ఇండియా డే పరేడ్‌ (India Day Parade)లో గ్రాండ్ మార్షల్ (Grand Marshal) హోదాలో పాల్గొన్న అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ (Sneha)తో కలిసి జీపులో మువ్వన్నెల జెండా పట్టుకొని ర్యాలీకి నాయకత్వం వహించారు. మొత్తం మీద అల్లు అర్జున్ అమెరికా యాత్ర మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన అమెరికా ఆహ్వానాన్ని వెంటనే అంగీకరించడానికి కారణం- చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు వేడుకలకు హాజరు కాకుండా తప్పించుకోవటం కోసమేనని అంటున్నారు. కారణాలేమైనా.. ఇదీ అల్లు అర్జున్ అమెరికా యాత్ర తెరవెనుక కథ.

Updated Date - 2022-08-27T22:57:26+05:30 IST