Superstar బాటలో ఐకాన్ స్టార్

ABN , First Publish Date - 2022-08-01T20:34:20+05:30 IST

స్తుతం టాలీవుడ్‌లో కమర్షియల్ యాడ్స్‌తో నిత్యం బిజీగా ఉండే స్టార్ ఎవరంటే.. అందరూ ఠక్కున చెప్పే పేరు మహేశ్ బాబు (Mahesh Babu). అతడు చేసిన యాడ్స్ ఇంకే హీరో చేయలేందంటే.. అందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

Superstar బాటలో ఐకాన్ స్టార్

ప్రస్తుతం టాలీవుడ్‌లో కమర్షియల్ యాడ్స్‌తో నిత్యం బిజీగా ఉండే స్టార్ ఎవరంటే.. అందరూ ఠక్కున చెప్పే పేరు మహేశ్ బాబు (Mahesh Babu). అతడు చేసిన యాడ్స్ ఇంకే హీరో చేయలేందంటే.. అందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. తనకున్న సూపర్ ఫాలోయింగ్‌తో వరుసగా యాడ్స్‌లో అవకాశాలు అందిపుచ్చుకొని భారీ పారితోషికం అందుకుంటూ.. ఈ విషయంలో తనకు తిరుగే లేదని నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు మహేశ్ రూట్లోనే బన్నీ (Bunny) కూడా వెళుతుండడం విశేషం. ‘అల వైకుంఠపురములో’ (Alavaikunthapuramulo ) చిత్రం సూపర్ సక్సెస్ తర్వాత బన్నీ.. మూడు, నాలుగు యాడ్స్ వరకూ చేశాడు. అవన్నీ అతడి క్రేజ్ వల్ల బాగా క్లిక్ అయ్యాయి. తాజాగా బన్నీ మరో క్రేజీ యాడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.


ఇటీవల హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఒక ప్రముఖ బ్రాండ్ కోసం రూపొందించే ఒక యాడ్‌లో నటించాడు. దీని కోసం బన్నీ డిఫరెంట్ గెటప్స్ ట్రైచేసి .. ఫైనల్ గా ఒక గెటప్ ను ఖాయం చేసి యాడ్ లో నటించాడు. ఆ గెటప్ ఇలా బైటికి వచ్చిందో లేదో.. అది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోయింది. అందులో బన్నీ మునుపెన్నడూ కనిపించని రీతిలో కనిపించి అభిమానులకు కనువిందు చేశాడు. ఆ గెటప్‌ను చూసిన కొందరు అది ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా కోసం అనుకున్నారు. అయితే అది యాడ్ అని తెలిసాకా.. ఆ గెటప్‌తో బన్నీ ఒక సినిమాలో నటిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. హరీశ్ శంకర్ ఈ యాడ్ పై మంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. అందులో బన్నీ ఆ బ్రాండ్ గురించి ఏం చెప్పాడు అన్నది ఆసక్తిగా మారింది.


‘పుష్ప’ (Pushpa) చిత్రం సూపర్ సక్సెస్ తో అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్‌లో అయితే.. కుర్రకారు అల్లు అర్జున్ మ్యానియాతో ఊగిపోయారు. దాంతో బన్నీని వెతుక్కుంటూ చాలా కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా చేయమని వెంటపడుతున్నాయట. వాటిలో బన్నీ కొన్ని మాత్రమే ఎంచుకొని ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. ఏదేమైనా బన్నీ మాత్రం పుష్ప క్రేజ్ ను పెర్ఫెక్ట్ గా వాడుకుంటూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ‘పుష్ప 2’ కూడా సూపర్ హిట్టయి అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ డబుల్ అయితే..  ఇంకెన్ని కమర్షియల్ యాడ్స్‌లో అతడు దర్శనమిస్తాడో చూడాలి. 

Updated Date - 2022-08-01T20:34:20+05:30 IST