‘వార్నర్ బ్రదర్.. తగ్గేదే లే..!’: ‘పుష్ప’ రాజ్

ABN , First Publish Date - 2021-12-12T03:17:46+05:30 IST

‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి డ్యాన్స్ చేసి.. అప్పట్లో సంచలనం క్రియేట్ చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్‌తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో..

‘వార్నర్ బ్రదర్.. తగ్గేదే లే..!’: ‘పుష్ప’ రాజ్

‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి డ్యాన్స్ చేసి.. అప్పట్లో సంచలనం క్రియేట్ చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్‌తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎందరో హీరోల ఫేస్ మార్ఫ్ చేసి.. వారి ఫేసులకు అనుగుణంగా తన ఫేస్‌తో డైలాగ్స్, డ్యాన్సులు చేస్తూ అలరిస్తూ వస్తున్న వార్నర్.. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప’ చిత్రంలోని ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. బన్నీ ఫేస్‌ని తన ఫేస్‌తో మార్ఫ్ చేసి వార్నర్ డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇండియన్ క్రికెటర్ కోహ్లీనే కాకుండా మరెందరో కామెంట్స్ చేస్తున్నారంటే.. ఏ రేంజ్‌లో ఈ వీడియో సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 


ఇక వీడియోకు క్రికెటర్లు, నెటిజన్లే కాకుండా.. స్వయంగా ఈ పాటకి డ్యాన్స్ చేసిన అల్లు అర్జున్ సైతం ఆనందం వ్యక్తం చేస్తూ.. కామెంట్ చేశారు. ‘వార్నర్ బ్రదర్.. తగ్గేదే లే..’ అంటూ బన్నీ చేసిన కామెంట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. వార్నర్ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ సాధించడం గమనార్హం.



Updated Date - 2021-12-12T03:17:46+05:30 IST