టీం మెంబర్‌ని సర్‌ప్రైజ్ చేసిన అల్లు అర్జున్

ABN , First Publish Date - 2022-03-19T04:35:27+05:30 IST

టీమ్ మెంబర్స్‌ని సొంత వ్యక్తుల్లా చూస్తుకునే దర్శకుడు సుకుమార్. టాలీవుడ్‌లో ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. హీరోలలోనూ చాలా మంది తమ టీమ్‌ని సొంత వ్యక్తుల్లా భావిస్తుంటారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. తాజాగా తన టీమ్ మెంబర్స్‌లో..

టీం మెంబర్‌ని సర్‌ప్రైజ్ చేసిన అల్లు అర్జున్

టీమ్ మెంబర్స్‌ని సొంత వ్యక్తుల్లా చూస్తుకునే దర్శకుడు సుకుమార్. టాలీవుడ్‌లో ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. హీరోలలోనూ చాలా మంది తమ టీమ్‌ని సొంత వ్యక్తుల్లా భావిస్తుంటారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. తాజాగా తన టీమ్ మెంబర్స్‌లో ఒకరిని అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ చేశారు. తన కంటెంట్, డిజిటల్ హెడ్ అయిన శరత్ చంద్ర నాయుడు పుట్టిన రోజును వేడుకను అల్లు అర్జున్ ఘనంగా జరిపారు. తన టీమ్‌కు సంబంధించిన వారి బర్త్‌డే వేడుకలు ఇలా సెలబ్రేట్ చేయడం ఇది మొదటిసారి మాత్రమే కాదు. గతంలోనూ అనేక మార్లు ఇలాంటి విషయాల్లో అల్లు అర్జున్ పేరు వినిపించింది.


ఇక శరత్ చంద్ర పుట్టినరోజు వేడుకలో అయితే అల్లు అర్జున్ హోస్ట్‌గా మారడం విశేషం. డిజిటల్ హెడ్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఆ కేక్ మీద హైలెట్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోని శరత్ చంద్ర తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీనిని బట్టి తన టీమ్ మెంబర్స్‌ని ఆయన ఎంత స్పెషల్‌గా చూసుకుంటారో అనేది అర్థమవుతుంది. ప్రస్తుతం బన్నీ హాజరైన ఈ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Updated Date - 2022-03-19T04:35:27+05:30 IST