Allu Arjun: నువ్వే దూరం చేస్తున్నావేమో బన్నీ!

ABN , First Publish Date - 2022-09-04T00:00:31+05:30 IST

‘ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు’.. ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న చర్చ ఇది. పవన్‌కు శుభాకాంక్షలతో బన్నీ నెట్టింట ఏకిపారేస్తున్నారు.

Allu Arjun: నువ్వే దూరం చేస్తున్నావేమో బన్నీ!

‘ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun).. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan kalyan)కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు’.. ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న చర్చ ఇది. పవన్‌కు శుభాకాంక్షలతో బన్నీ నెట్టింట ఏకిపారేస్తున్నారు. మెగా హీరో అనే ట్యాగ్‌ని చెరిపేసి... స్టైలిష్‌స్టార్‌గా, ఐకాన్‌స్టార్‌గా.. ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు అల్లు అర్జున్‌. చిరంజీవి నీడలో పెరిగి, ఇప్పుడు తనకంటూ సెపరేట్‌ బ్రాండ్‌ని క్రియేట్‌ చేసుకున్న బన్నీని మెగా ఫ్యాన్స్‌ దూరం పెట్టడం ప్రారంభించి చాలా రోజులే అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడమని బన్నీని అభిమానులను అడిగిన సమయంలో ‘చెప్పను బ్రదర్‌’ అనే కామెంట్‌ చేయడంతో మొదలైన రచ్చ... రోజు రోజుకీ పెరిగి అల్లు అర్జున్‌ మెగా హీరో కాదనే వరకూ వెళ్లింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మెగా ఫ్యాన్స్‌ బన్నీని వేరు చేసి  చూశారు. తాజాగా ఈ విషయంపై ఓపెన్‌ అయిన అల్లు అర్జున్‌.. ‘మా పునాది’ అంటూ అల్లు రామలింగయ్య ఫోటో పెట్టడంతో... తనని మెగా ఫ్యాన్స్‌ కాదు, తానే మెగా ఫ్యాన్స్‌ని డిస్‌ ఓన్‌ చేసుకుంటున్నట్లు అఫీషియల్‌గా చెప్పేశాడు. (Cheppanu brother)


ఇక మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్‌ పార్ట్‌ కాదు, చిరు బర్త్‌ డేని స్కిప్‌ చేయడానికే బన్నీ ఫారిన్‌ వెళ్లాడని అంతా అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్‌ తన పెద్ద మావయ్య చిరు ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ ట్వీట్‌ నెట్టింట వేడిన తగ్గించింది. తాజాగా బన్నీ మళ్లీ వార్తలో నిలిచాడు. పవన్‌ కళ్యాణ్‌ విషయంలో ప్రవర్తించిన తీరుకి మెగా ఫ్యాన్స్‌... ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు. సెప్టెంబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు. ఇండస్ర్టీలో ఉండే ప్రతి ఒక్కరూ పవర్‌ స్టార్‌కి బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్‌ నుంచి స్పందన మాత్రం లేదు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ కూడా లేదు. ఇదే మరోసారి ‘చెప్పను బ్రదర్‌’ వివాదాన్ని బయటకి తీసింది. ఇంటర్నల్‌గా ఎన్ని ఉన్నా, అల్లు అర్జున్‌ ఒక్క ట్వీట్‌ చేసి ఉంటే అయిపోయేది.. అనవసర చర్చ జరిగేది కాదు. బన్నీ ఇలా చేయడం వల్ల తనని ఇష్టపడుతున్న కొంతమంది మెగా అభిమానులకు దూరం అవుతాడు అనేది నిజం. బన్నీ ఈ విషయాన్ని గమనిస్తే బావుంటుంది. 


అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలంటున్నారు కొందరు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో ఫొటో పెట్టి విషెస్‌ చెబితేనే ఓ మనిషిని గుర్తించినట్లు అన్నది కరెక్ట్‌ కాదు. ఒకవేళ బన్నీ తన మావయ్య పవన్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పాడేమో అన్నది కూడా ఆలోచించాలి అని కొందరు ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2022-09-04T00:00:31+05:30 IST