55 ఏళ్ళ వ్యక్తిగా Allu Arjun ?

ABN , First Publish Date - 2022-06-06T14:40:17+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గతేడాది ‘పుష్ప’ (Pushpa) చిత్రంతో జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై.. అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

55 ఏళ్ళ వ్యక్తిగా Allu Arjun ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  గతేడాది ‘పుష్ప’ (Pushpa) చిత్రంతో జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై.. అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ అద్భుతమైన నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) గ్లామర్ అపీరెన్స్, దేవీశ్రీ (Devisri) సంగీతం . ‘పుష్ప’ మొదటి భాగానికి హైలైట్స్ గా నిలిచిపోయాయి. దీంతో ఈ సినిమా రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం విషయంలో తలెత్తిన విమర్శలు, కథాకథనాల్లోని చిన్నపాటి దోషాల్ని .. రెండో భాగంలో రిపీట్ చేయకుండా ఉండేందుకు.. ‘పుష్ప ది రూల్’ స్ర్కి్ప్ట్ ను మరింత పగడ్బందీగా రాసుకుంటున్నాడట సుకుమార్. దాని కోసం కాస్తంత ఎక్కువ సమయాన్నే తీసుకుంటున్నాడట. అందుకే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేందుకు మరింత టైమ్ పట్టొచ్చని సమాచారం అందుతోంది. బన్నీ సైతం రెండో భాగం విషయంలో కాంప్రమైజ్ కాకుండా..  స్ర్కిప్ట్ విషయంలో మరింత పట్టుదలగా ఉన్నాడట. 


ఇదిలా ఉంటే.. ‘పుష్ప 2’ (Pushpa 2)  కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ రెండో భాగంలో అల్లు అర్జున్  55 ఏళ్ళ వ్యక్తిగా కనిపించబోతున్నాడట. దీనికోసం వెరైటీగా మేకోవర్ అవుతున్నాడట బన్నీ.  అంతేకాదు ఇందులో అతడికి కొడుకు పాత్ర కూడా ఉంటుందట. దీనికోసం ఓ యంగ్ హీరోని ఎంపిక చేయబోతున్నట్టు టాక్. మొదటి భాగం ఎండింగ్ లో పుష్పరాజ్ కు శ్రీవల్లితో పెళ్ళవుతుంది. రెండో భాగంలో స్మగ్లింగ్ సిండికేట్ కు కింగ్ అయిన పుష్పకు కొడుకు పుట్టి.. అతడు ఫ్యామిలీ మేన్ గా కూడా మారతాడు. తండ్రీ కొడుకుల మధ్య బాండింగ్ , ఎమోషన్స్ సినిమాకే హైలైట్ అవుతాయట. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ..  బన్నీ 55 ఏళ్ళ వ్యక్తిగా కనిపించడం మాత్రం నిజంగా ఈ సినిమాకి ప్రత్యేకమైనదనే చెప్పాలి. 

Updated Date - 2022-06-06T14:40:17+05:30 IST