హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ Allu Arjun

ABN , First Publish Date - 2022-07-05T23:29:31+05:30 IST

అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాల పరంగా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. తన కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ పై స్థాయిలో ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాడు. కథల విషయంలోనూ, పాత్రల విషయంలోనూ కొత్తదనం ఉండేలా ప్రత్యేక దృష్టిపెడుతుంటాడు.

హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ Allu Arjun

అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాల పరంగా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. తన కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ పై స్థాయిలో ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాడు. కథల విషయంలోనూ, పాత్రల విషయంలోనూ కొత్తదనం ఉండేలా ప్రత్యేక దృష్టిపెడుతుంటాడు. ‘పుష్ప’ (Pushpa) సినిమా బన్నీకి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దాన్ని అలాగే కొనసాగించడానికి ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విషయంలో మరింతగా కేర్ తీసుకుంటున్నాడు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ గ్యాప్‌లో తదుపరి చిత్రాల్ని వరుసగా సెట్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప 2’ చిత్రం తర్వాత బన్నీ ఏ ఏ సినిమాలు చేయబోతున్నాడు అనే విషయంలో అంతటా ఆసక్తి నెలకొంది. 


తాజాగా ఒక ఇంటర్వ్యూలో గీతా ఆర్ట్స్ 2 (Geetha Arts 2) నిర్మాత బన్నీ వాసు (bunny vasu) అల్లు అర్జున్ తదుపరి చిత్రాల లైనప్‌ను వెల్లడించాడు. ‘పుష్ప 2’ తర్వాత బోయపాటి (Boyapati) దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడని, ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సినిమా ఉండబోతోందని, బోయపాటి చిత్రం తర్వాత ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోందని వివరించాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాల్ని తాను త్రివిక్రమ్ తో మాట్లాడానని బన్నీ వాసు తెలిపాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఇంతకు ముందు నటించిన ‘జులాయి (Julayi), సన్నాఫ్ సత్యమూర్తి (Son OF Satyamurthy), అల వైకుంఠపురములో (Ala Vaikunthapuramulo)’ చిత్రాలు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో తెలిసిందే. 


అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ‘జులాయి’ తరహాలోని మరో యాక్షన్ కథాంశాన్ని సిద్ధం చేస్తున్నాడట త్రివిక్రమ్. త్రివిక్రమ్ చిత్రాల్లో కామన్ గా ఉండే ఫ్యామిలీ సెంటిమెంట్ ను కూడా అందులో జోడిస్తున్నట్టు సమాచారం. బన్నీ సినిమాలు ఇంతవరకూ అతడి సొంత సంస్థ  గీతా ఆర్ట్స్ లోనే నిర్మాణం జరుపుకున్నాయి. త్రివిక్రమ్ చిత్రంతో తొలిసారిగా బన్నీ గీతా ఆర్ట్స్ 2 లో సినిమా చేయనుండడం విశేషం. మరి ఈ సారి త్రివిక్రమ్ బన్నీకి ఏ స్థాయి హిట్టిస్తాడో చూడాలి.  

Updated Date - 2022-07-05T23:29:31+05:30 IST