Allu Arjun: అసలెందులోనూ తగ్గడం లేదుగా..

ABN , First Publish Date - 2022-09-06T06:01:23+05:30 IST

అల్లు అర్జున్.. (Allu Arjun) ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న పేరు. ‘పుష్ప’ (Pushpa) సినిమా తర్వాత అల్లు అర్జున్‌కి ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ఆ సినిమాలోని మ్యానరిజమ్స్

Allu Arjun: అసలెందులోనూ తగ్గడం లేదుగా..

అల్లు అర్జున్.. (Allu Arjun) ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న పేరు. ‘పుష్ప’ (Pushpa) సినిమా తర్వాత అల్లు అర్జున్‌కి ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ఆ సినిమాలోని మ్యానరిజమ్స్ ప్రపంచవ్యాప్తంగా అనుకరించారు.. ఇంకా అనుకరిస్తూనే ఉన్నారు. ‘పుష్పరాజ్’గానే కాకుండా.. ఇప్పుడు పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. నిత్యం వార్తల్లో ఉంటున్న అల్లు అర్జున్.. తాజాగా గణేష్ నిమజ్జనం విషయంలోనూ హాట్ టాపిక్ అయ్యారు. 


ప్రతి సంవత్సరం, అల్లు అర్జున్ తన కార్యాలయంలో వినాయకుని ప్రతిష్టించి పూజలు జరుపుతుంటారు. గణేష్ చతుర్థి పండుగను తన సిబ్బందితో కలిసి ఘనంగా జరుపుకుంటాడు. ఈ సంవత్సరం కూడా ఆ మాదిరిగానే గణేశుని ప్రతిమను ప్రతిష్టించారు. అల్లు అర్జున్ తన బృందంతో కలిసి గణేష్ నిమజ్జనం (ganesh nimajjanam)లో పాల్గొన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా స్టార్‌ క్రేజ్ ఉన్నా.. భారతీయ సంస్కృతికి పెద్ద పీట వేస్తూ... గణేష్ నిమజ్జన వేడుకల నిమిత్తం రోడ్డుపైకి రావడానికి బన్నీ వెనుకాడలేదు. తనే కాదు తన కూతురిని కూడా వెంటబెట్టుకుని.. స్వామికి వీడ్కోలు పలుకుతూ కొబ్బరికాయ కొట్లాడు అల్లు అర్జున్. అలానే అర్హను ఊరేగింపులో భాగమవ్వాలని, నిమజ్జన ఊరేగింపుని దగ్గరగా చూడమని చెబుతూ.. పండుగ ప్రాముఖ్యతను తన కుమార్తెకు తెలియజేస్తున్నట్లుగా ఈ వీడియోలో వారిద్దరూ కనిపిస్తున్న తీరుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated Date - 2022-09-06T06:01:23+05:30 IST