Allari Naresh : షాకిస్తోన్న ఉగ్రరూపం !

ABN , First Publish Date - 2022-08-22T16:44:21+05:30 IST

ఇన్నాళ్ళూ తన కామెడీ డైమింగ్‌తో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన అల్లరి నరేశ్.. ఇప్పుడు సెపరేట్ రూట్లో పయనిస్తున్నాడు. ఇంతకాలం థియేటర్స్‌లో సంచుల కొద్దీ కామెడీ పంచుల్ని వెదజల్లిన అతడు.. ఇప్పుడు దానికి పూర్తి విరుద్దంగా ఎమోషన్స్‌తో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి నాందిగా నిలిచిపోయిన చిత్రం ‘నాంది’.

Allari Naresh : షాకిస్తోన్న ఉగ్రరూపం !

ఇన్నాళ్ళూ తన కామెడీ డైమింగ్‌తో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన అల్లరి నరేశ్.. ఇప్పుడు సెపరేట్ రూట్లో పయనిస్తున్నాడు. ఇంతకాలం థియేటర్స్‌లో సంచుల కొద్దీ కామెడీ పంచుల్ని వెదజల్లిన అతడు.. ఇప్పుడు దానికి పూర్తి విరుద్దంగా ఎమోషన్స్‌తో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి నాందిగా నిలిచిపోయిన చిత్రం ‘నాంది’. 


చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు శిక్షపడిన యువకుడిగా.. ఆ పాత్రలో భావోద్వేగాల్ని పీక్స్‌లో పండించి.. ప్రేక్షకుల మెప్పు పొందాడు నరేశ్. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించి.. మొదటి ప్రయత్నంలోనే సత్తా ఉన్న దర్శకుడిగా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేశ్ నటిస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రం కూడా కాన్సెప్ట్ బేస్డ్ మూవీనే. 


ఇదిలా ఉంటే.. అల్లరి నరేశ్ మరో సరికొత్త చిత్రంలోనూ నటిస్తున్నాడు. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దీనికి దర్శకుడు. సినిమా పేరు ‘ఉగ్రం’. ఇందులో కూడా నరేశ్ తన అభినయ కౌశలాన్ని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. నేడు (ఆగస్ట్ 22)న ‘ఉగ్రం’ సినిమాను అనౌన్స్ చేస్తూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.  వీపులో కత్తి దిగి.. రక్తమోడుతూ.. రివీలైన అల్లరి నరేశ్ ఉగ్రరూపం షాకిస్తోంది. ఈ సినిమా కాస్త యాక్షన్‌తో కూడుకున్న చిత్రమని పోస్టర్ ను బట్టి అర్ధమవుతోంది. షైన్ స్ర్కీన్ బ్యానర్ పై సాహుగారపాటి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియలేదు. 



Updated Date - 2022-08-22T16:44:21+05:30 IST