ఎవరీ Riyasdeen Riyan.. AR Rahman కూతుర్ని పెళ్లాడిన ఇతడి గురించి ఆసక్తికర విషయాలివీ..!

ABN , First Publish Date - 2022-05-06T17:47:07+05:30 IST

ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ వివాహం రియాస్దీన్ రియాన్‌‌తో జరిగింది...

ఎవరీ Riyasdeen Riyan.. AR Rahman కూతుర్ని పెళ్లాడిన ఇతడి గురించి ఆసక్తికర విషయాలివీ..!

ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ వివాహం రియాస్దీన్ రియాన్‌‌తో జరిగింది. వారి పెళ్లికి సంబంధించిన అమూల్యమైన పిక్‌ని పోస్ట్ చేసిన రెహమాన్ అభిమానులతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్‌కి ‘దేవుడు ఈ జంటను ఆశీర్వదిస్తాడు.. మీ శుభాకాంక్షలు, ప్రేమకు అడ్వాన్స్‌గా ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు.


ఖతీజా సైతం తండ్రి రెహమాన్‌లాగే  మంచి గాయని, సంగీత విద్వాంసురాలు. ఆమె సైతం భర్త రియాస్దీన్‌తో కలిసి దిగిన పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి.. ‘నా జీవితంలో ఎంతో ఎదురుచూసిన రోజు వచ్చింది. నాకు ఇష్టమైన వ్యక్తి రియాస్దీన్‌తో వివాహం జరిగింది’ అని రాసుకొచ్చింది.


నిజానికి రియాస్దీన్ ఆడియో ఇంజనీర్‌గా పనిచేస్తూ.. ఎప్పటి నుంచో మ్యూజిక్ వ్యాపారంలో ఉన్నాడు. అందువల్ల మామయ్య ఏఆర్ రెహమాన్‌, సంగీత మావెరిక్ అమిత్ త్రివేదితో కలిసి పలు సంగీత ప్రదర్శనలకి రియాస్దీన్ పని చేశాడు. 2019లో దోహాలోని ఖలీఫా స్టేడియంలో ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ప్రత్యక్ష ప్రదర్శనలో సైతం ఈయన పాల్గొన్నాడు. అంతేకాకుండా 2017 నుంచి వారిద్దరూ పలు ప్రాజెక్టులకి కలిసి పనిచేస్తున్నారు. అలాగే అదే ఏడాది విడుదలైన తమిళ నటుడు దళపతి విజయ్ సినిమా మ్యూజిక్‌ కోసం కూడా ఈ మామ అల్లుళ్లు కలిసి వర్క్ చేశారు. బెన్నీ దయాల్, హరిచరణ్ శేషాద్రి వంటి ప్రముఖ గాయకులతో పలు ప్రదర్శనలకు సైతం రియాస్దీన్ పని చేశాడు.







Updated Date - 2022-05-06T17:47:07+05:30 IST