అలియా అంటే అల్లాటప్పానా

ABN , First Publish Date - 2022-08-08T06:12:40+05:30 IST

సినిమాల్లో హీరోయిన్‌గానే కాదు సోషల్‌ మీడియాలో సెలబ్రిటీగా తన హవా కొనసాగిస్తున్నారు అలియాభట్‌. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల్లో బ్రాండ్‌ ప్రమోషన్ల...

అలియా అంటే అల్లాటప్పానా

సినిమాల్లో హీరోయిన్‌గానే కాదు సోషల్‌ మీడియాలో సెలబ్రిటీగా తన హవా కొనసాగిస్తున్నారు అలియాభట్‌. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల్లో బ్రాండ్‌ ప్రమోషన్ల ద్వారా సినిమా పారితోషికాలకు ఽధీటుగా ఆమె ఆర్జిస్తున్నారు. అలియా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పలు వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండ్‌ ప్రమోషన్‌ చేస్తున్నారు. అందుకు గాను ఒక్కో పోస్ట్‌కు రూ. 85 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఛార్జ్‌ చేస్తున్నారట అలియాభట్‌. ఆమె నటించిన సినిమాలు రిలీజ్‌కు ఉన్నప్పుడు అయితే ఈ మొత్తం మరింత పెరిగే  అవకాశముంది. ప్రముఖ సెలబ్రిటి బ్రాండ్‌ వాల్యూ రిపోర్ట్‌ ప్రకారం అలియాభట్‌ బ్రాండ్‌ వాల్యూ దాదాపు రూ. 550 కోట్లు. అంతేకాదు అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న టాప్‌టెన్‌ సెలబ్రిటీలో అలియానే పిన్న వయస్కురాలు కావడం విశేషం. బ్రాండ్‌ షూట్స్‌లో పాల్గొనేందుకు రోజుకు రూ. 2 కోట్లు, బ్రాండ్‌ లాంచ్‌, ప్రొడక్ట్‌ లాంచ్‌కు రూ. 2 కోట్ల మొత్తం అందుకుంటున్నారట అలియా. భారీ మొత్తాలను ఇచ్చేందుకు వ్యాపార సంస్థలు వెనుకాడకపోవడాన్ని చూసి, అలియా పోస్ట్‌ పెట్టిందంటే అల్లాటప్పానా అనుకుంటున్నారు అభిమానులు. 


Updated Date - 2022-08-08T06:12:40+05:30 IST