తల్లి కాబోతున్న అలియా

ABN , First Publish Date - 2022-06-28T05:46:42+05:30 IST

పెళ్లయిన మూడు నెలలకు బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌ ఓ శుభవార్తను తన అభిమానులకు తెలిపారు....

తల్లి కాబోతున్న అలియా

పెళ్లయిన మూడు నెలలకు బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌ ఓ శుభవార్తను తన అభిమానులకు తెలిపారు. త్వరలో తను తల్లి కాబోతున్న విషయాన్ని ఆమె సోమవారం సోషల్‌ మీడియా ద్వారా  వెల్లడించారు. రణ్‌బీర్‌, తను ఉన్న ఫొటోతో పాటు  మగ సింహం, ఆడ సింహం తమ పిల్లతో ఉన్న ఫొటోను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అలియాకు,  ఆమె భర్త రణ్‌బీర్‌కు దక్షిణ ఆఫ్రికా అంటే చాలా ఇష్టం. అక్కడున్న సఫారీలు  చాలా సార్లు చూశారు కూడా. అందుకే తను తల్లి కాబోతున్నాననే వార్తతో లయన్‌ ఫ్యామిలీ ఫొటోను ఆమె షేర్‌ చేసిందంటున్నారు.  అలియా పెట్టిన పోస్ట్‌కు ఆమెకు తల్లి సోనీ రజ్ధాన్‌ ‘కంగ్రాట్స్‌ మామ అండ్‌ పాప లయన్‌’ అని కామెంట్‌ పెట్టడం గమనార్హం .

Updated Date - 2022-06-28T05:46:42+05:30 IST