Alia Bhatt - Ranbir Kapoor wedding: కన్నీటీ పర్యంతమైన ‘RRR’ భామ స్నేహితురాలు.. పిక్స్ వైరల్

ABN , First Publish Date - 2022-05-01T15:25:23+05:30 IST

తాజాగా బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్, రణబీర్ కపూర్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా

Alia Bhatt - Ranbir Kapoor wedding: కన్నీటీ పర్యంతమైన ‘RRR’ భామ స్నేహితురాలు.. పిక్స్ వైరల్

తాజాగా బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్, రణబీర్ కపూర్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట ఏప్రిల్ 14న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత ఈ విషయాన్ని తెలుపుతూ అలియా మ్యారేజ్ పిక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అధికారికంగా కన్‌‌ఫర్మ్ చేసింది. అప్పటినుంచి ప్రతి రోజూ వారి పెళ్లి గురించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా అలియా భట్ ప్రాణ స్నేహితురాలు ఆకాంక్ష రంజన్ కపూర్ ఈ భామ మెహందీ వేడుకకి సంబంధించి కొన్ని పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది.


అందులో.. పసుపు రంగు చీర ధరించిన ఆకాంక్ష నవ్వుతూ ఎంతో అందంగా కనిపించింది. తర్వాత వచ్చే పిక్స్‌లో అలియా చేతులు పట్టుకొని ఏడుస్తూ కనిపించింది. ఆ భామని అలియా ఓదార్చుతున్నట్లు అందులో ఉంది. ఈ పిక్స్‌కి.. ‘ప్రతి పెళ్లిలో ఆకాంక్ష రంజన్ కపూర్ భావోద్వేగాలు ఇలాగే ఉంటాయి’ అని రాసుకొచ్చింది. ఈ భామ పోస్ట్‌పై అలియాతోపాటు వాణి కపూర్, అతియా శెట్టి వంటి బాలీవుడ్ తారలు స్పందించారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి.



Updated Date - 2022-05-01T15:25:23+05:30 IST