Katrina Kaif రెయిన్ సాంగ్‌పై Alia Bhatt, Taapsee Pannu ప్రశంసలు!

ABN , First Publish Date - 2021-11-08T16:33:23+05:30 IST

సినిమాల్లో వర్షం పాటలకు ఉండే క్రేజే వేరు.

Katrina Kaif రెయిన్ సాంగ్‌పై Alia Bhatt, Taapsee Pannu ప్రశంసలు!

సినిమాల్లో వర్షం పాటలకు ఉండే క్రేజే వేరు. తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ రెయిన్ సాంగ్స్ ఉన్నాయి. హిందీలో ఎంతో మంది హీరోహీరోయిన్లు వర్షంలో ఆడి పాడి ప్రేక్షకులను అలరించారు. హిందీలో బాగా ప్రేక్షకాదరణ పొందిన రెయిన్ సాంగ్స్‌లో `టిప్ టిప్ బర్సా పాని` పాట ఒకటి. 1994లో విడుదలైన `మోహ్రా` సినిమాలోనిది ఈ పాట. అక్షయ్ కుమార్, రవీనా టాండన్ జంట ఈ పాటకు చిందులేసింది. 


తాజాగా విడుదలైన `సూర్యవంశీ` కోసం ఈ పాటను మళ్లీ సృష్టించారు. ఈ పాటలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ కనిపించారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను కత్రిన తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌లో చిత్రీకరించిన ఈ పాటలో కత్రిన డ్యాన్స్ ఆకట్టుకుంది. ఆ వీడియోపై ఆలియా భట్, తాప్సీ పన్ను ప్రశంసలు కురిపించారు. `వర్షంలో క్యాటీ డ్యాన్స్ అద్భుతం` అని ఆలియా భట్, `వాటే వావ్` అని తాప్సీ కామెంట్లు చేశారు. 



Updated Date - 2021-11-08T16:33:23+05:30 IST