Alia Bhatt: పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. మొదటిసారి స్పందించిన ఆలియా

ABN , First Publish Date - 2022-07-27T19:26:07+05:30 IST

బాలీవుడ్‌లోని క్రేజీ హీరోయిన్స్‌లో ఆలియా భట్ ఒకరు. స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా వెలుగుతోంది...

Alia Bhatt: పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. మొదటిసారి స్పందించిన ఆలియా

బాలీవుడ్‌లోని క్రేజీ హీరోయిన్స్‌లో ఆలియా భట్ (Alia Bhatt) ఒకరు. స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈ బ్యూటీ ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌ (Ranbir Kapoor)ని ప్రేమ వివాహ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట దాదాపు ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉండి ఏప్రిల్ 14న బంధుమిత్రుల సమక్షంలో ఒకటయ్యారు. అయితే.. పెళ్లైన 2 నెలల తర్వాత ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్తని తెలిపింది. ఆలియా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెబుతూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.


అయితే.. పెళ్లైన రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీ (pregnancy)ని ప్రకటించడంతో విమర్శల పాలైంది. ఈ విషయంలో పలువురు నెటిజన్లు ఈ జంటకి మద్ధతుగా నిలవగా.. మరి కొందరు మాత్రం చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అయితే.. వీటిపై ఇప్పటివరకూ ఆలియా కానీ, రణ్‌బీర్ కానీ స్పందించలేదు. కానీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆలియా స్పందిస్తూ ట్రోలర్స్ గట్టి కౌంటర్ ఇచ్చింది.


ఆలియా తాజాగా నటించిన చిత్రం ‘డార్లింగ్స్(Darlings)’. ఈ మూవీ త్వరలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ విడుదలకానుంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆలియా మాట్లాడుతూ.. ‘మహిళలు చేసే ప్రతి పనిని అనుమానంగానే చూస్తారు. ఆమె తల్లి కావాలని నిర్ణయించుకున్నా, ఆమె కొత్త వారితో డేటింగ్ చేస్తున్నా, ఆమె క్రికెట్ మ్యాచ్‌కి లేదా సెలవులకు వెళుతున్నా. పలు కారణాల వల్ల ఆమెని కొన్ని కన్నులు గమనిస్తూనే ఉంటాయి. అందుకే ఇలాంటి వాటిని పట్టించుకోవడం మానేశాను’ అని చెప్పుకొచ్చింది.


అలాగే.. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడంపై ఆలియా స్పందిస్తూ.. ‘నాకు వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసు. గొప్ప విషయాలను ఎవరూ ప్లాన్ చేయలేరని, వాటంతటా అవే జరుగుతాయి. పరిస్థితులు మారుతున్నందుకు బాధగా లేదు. నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే ఎవరి సపోర్టు నాకు అవసరం లేదు’ అని తెలిపింది. కాగా.. భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆలియా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అలాగే.. రణ్‌వీర్ సింగ్‌లో కలిసి ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’లో.. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌తో కలిసి ‘జీ లే జరా’లో నటిస్తోంది. అంతేకాకుండా.. ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడెట్‌తో కలిసి ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ మూవీ చేస్తోంది.

Updated Date - 2022-07-27T19:26:07+05:30 IST