Alia Bhatt: నేను ఐఐటీలో అడుగుపెట్టా.. ఇకపై గర్వంగా చెప్పుకుంటా..

ABN , First Publish Date - 2022-08-28T17:06:16+05:30 IST

బాలీవుడ్‌లో ఏ పాత్రనైనా చాలా ఈజీగా రక్తికట్టించగల నటీమణుల్లో చాలా కొద్దిమందే ఉన్నారు. ఆ జాబితాలో టాప్ ఉండే బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt)...

Alia Bhatt: నేను ఐఐటీలో అడుగుపెట్టా.. ఇకపై గర్వంగా చెప్పుకుంటా..

బాలీవుడ్‌లో ఏ పాత్రనైనా చాలా ఈజీగా రక్తికట్టించగల నటీమణుల్లో చాలా కొద్దిమందే ఉన్నారు. ఆ జాబితాలో టాప్ ఉండే బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt). అందుకే భారీగా ఫ్యాన్స్‌ని సంపాదించుకుని టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించింది. కాగా.. ఈ బ్యూటీ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమా ‘డార్లింగ్స్’తో ప్రేక్షకులని పలకరించింది. ఆ సినిమాలో నటనతో మరోసారి ఆలియా టాలెంట్‌ని చూపించింది.


అయితే.. ఆలియా తాజాగా నటించిన మూవీ ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’. ఈ మూవీలో ఈ భామ ఆమె భర్త, బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌(Ranbir Kapoor)తో కలిసి మొదటిసారి నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదలకానుంది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీగా ఉంది. అందులో భాగంగా ముంబై ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆలియా హాజరైంది.


ఆ కార్యకమంలో పాల్గొన్న తర్వాత అక్కడ దిగిన కొన్ని పిక్స్‌ని ఆలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్‌కి.. ‘ఐఐటీ బాంబేకి వచ్చాం.. ప్రమోషన్‌లకు ధన్యవాదాలు. నేను IITలోకి అడుగుపెట్టానని గర్వంగా చెప్పగలను (ఒక గంటపాటు)’ అని రాసుకొచ్చింది. కాగా.. ఏప్రిల్‌ 14న రణ్‌బీర్ కపూర్‌, ఆలియాకి పెళ్లికాగా.. ఆమె ప్రస్తుతం గర్భవతి. అయినప్పటికీ ఆలియా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే సినిమా చేస్తూ కెరీర్‌లో ముందుకు దూసుకుపోతూనే ఉంది.



Updated Date - 2022-08-28T17:06:16+05:30 IST