Alia Bhatt: మొదటి సినిమాకి ఆలియా అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందా.. అది కూడా..

ABN , First Publish Date - 2022-08-21T17:07:37+05:30 IST

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్ల జాబితాలో ఆలియాభట్ పేరు కచ్చితంగా ఉంటుంది. వరుసగా స్టార్ హీరోలతో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ..

Alia Bhatt: మొదటి సినిమాకి ఆలియా అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందా.. అది కూడా..

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్ల జాబితాలో ఆలియాభట్ (Alia Bhatt) పేరు కచ్చితంగా ఉంటుంది. వరుసగా స్టార్ హీరోలతో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాకుండా ఒక్కో సినిమాకి దాదాపు రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ (remuneration) తీసుకుంటుందని టాక్. అయితే.. ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘డార్లింగ్స్’. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ మూవీ మంచి వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. అలాగే.. ఈ బ్యూటీ, ఆమె భర్త రణ్‌బీర్ కపూర్‌తో నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆలియా పాల్గొని తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


ఈ బ్యూటీ కెరీర్‌లో మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్(Student of the Year)’. వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు. కరణ్ జోహర్ (Karan Johar) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా.. ఈ సినిమాలో నటించిన ముగ్గురికి మంచి కెరీర్‌కి సెట్ అయ్యేందుకు చాలా ఉపయోగపడింది. ఈ సినిమాతో బాలీవుడ్‌కి అడుగుపెట్టినప్పుడూ ఆలియా వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఆ సినిమా గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమాకి నాకు కేవలం రూ.15 లక్షల పారితోషికంగా ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన చెక్‌ను నేరుగా తీసుకెళ్లి అమ్మచేతిలో పెట్టాను. నా మనీకి సంబంధించిన విషయాలన్నీ అమ్మనే చూసుకోమని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మా అమ్మే వాటి గురించి చూసుకుంటుంది’ అని చెప్పుకొచ్చింది.


కాగా.. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత రణ్‌బీర్ కపూర్ (Ranbir kapoor), ఆలియా ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆలియా గర్భవతి. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంట మొట్టమొదటి సారి కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.

Updated Date - 2022-08-21T17:07:37+05:30 IST