Kangana ని ‘లైట్’ తీసుకున్న Alia! ఉన్నది ఒకటే జిందగీ... అంటోన్న ‘గంగూబాయ్’!

ABN , First Publish Date - 2022-02-28T03:57:45+05:30 IST

తన గురించి, తన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడి’ గురించి అనేక విమర్శలు చేసిన కంగనాని ఆలియా ‘లైట్’ తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఆమె కంగనా మాటల దాడిపై రీసెంట్ ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయింది.

Kangana ని ‘లైట్’ తీసుకున్న Alia! ఉన్నది ఒకటే జిందగీ... అంటోన్న ‘గంగూబాయ్’!

తన గురించి, తన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడి’ గురించి అనేక విమర్శలు చేసిన కంగనాని ఆలియా ‘లైట్’ తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఆమె కంగనా మాటల దాడిపై రీసెంట్ ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయింది. ‘‘నెగిటివిటి లేదా మరొకటి అంటూ నాకు నిజంగా ఏం లేవు...’’ అంది ఆలియా. కంగనా తనని టార్గెట్ చేసినా కూడా ఆమె గురించి తీవ్రంగా ఆలోచించని చెబుతోన్న ‘గంగూబాయ్’... ‘‘నాకు బాగా సవాళ్లు ఎదురైన క్లిష్టమైన రోజుని కూడా ‘లైట్’గా, ‘పాజిటివ్’గా గడపాలనే ప్రయత్నిస్తాను. ఎందుకంటే, మనకు ఉన్నది ఒకే ఒక్క జీవితం. కాబట్టి, దాన్ని వీలైనంత తేలికపర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి...’’ అంది. 


‘గంగూబాయ్ కతియావాడి’ సినిమా ఫిబ్రవరీ 25న విడుదలైంది. ఆలియా భట్ టైటిల్ రోల్ పొషించిన భారీ బడ్జెట్ మూవీ రిలీజ్‌కి ముందు కంగనా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరంటూ... ‘గంగూబాయ్’ని టార్గెట్ చేసింది. అయితే, ఆలియా మాత్రం కంగనా ఎన్ని మాటలన్నా సంయమనం పాటిస్తూ వస్తోంది. తాజాగా ‘ఉన్నది ఒకటే జిందగీ’ అంటూ... ఆ ఒకే ఒక్క లైఫ్‌లో వీలైనంత ‘లైట్‌నెస్’ నింపుకుంటానని కామెంట్ చేస్తూ... కంగనా రనౌత్‌ని ఆలియా ‘లైట్’ తీసేసుకుంది! మరి ఆలియా మీద కంగనా మున్ముందు మాట తీరు ఎలా ఉంటుందో... చూడాలి...   

Updated Date - 2022-02-28T03:57:45+05:30 IST