Alia Bhatt: కూతురు నటి అవుతుందా?.. ఆలియా రియాక్షన్ ఎంటంటే..

ABN , First Publish Date - 2022-11-23T19:30:38+05:30 IST

బాలీవుడ్ క్యూట్ కపుల్, స్టార్లు ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఇటీవలే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే..

Alia Bhatt: కూతురు నటి అవుతుందా?.. ఆలియా రియాక్షన్ ఎంటంటే..

బాలీవుడ్ క్యూట్ కపుల్, స్టార్లు ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఇటీవలే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌ ఈ జంటకి పెళ్లికాగా.. మూడు నెలలు తిరక్కుండానే ఆలియా గర్భవతి అయ్యింది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఈ జంట తమ కూతురిని ఎలా పెంచుతారనే ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో గర్భవతిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్య్వూ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఆ ఇంటర్వ్యూలో ఆలియా మాట్లాడుతూ.. ‘ఇంతమంది జనాల మధ్య నా పిల్లలను పెంచడానికి ఆందోళన చెందుతున్నాను. నేను నా స్నేహితులతో, నా కుటుంబంతో, నా భర్తతో దాని గురించి మాట్లాడుతాను. నా పిల్లల జీవితం, భవిష్యత్తుపై ఎవరి జోక్యాన్ని నేను సహించను. ఎందుకంటే.. నేను సినిమాని కెరీర్‌గా ఎంచుకున్నాను. కానీ నా బిడ్డకు ఈ మార్గంలో వెళ్లడం ఇష్టం లేకపోవచ్చు. అందుకే ఆమె లేక అతను ఎదిగే క్రమంలో ఈ విషయంలో రక్షణగా ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.


అలాగే ఆలియా ఇంకా మాట్లాడుతూ.. ‘నా బిడ్డ ఇదే చేయాలని నేను ఏది అనుకోట్లేదు. తను యాక్టర్ అవ్వాలా లేదా అనేదాని గురించి నాకు ఎటువంటి ఆలోచనలు లేవు. ఉండవు. ఎందుకంటే ఒకవేళ నేను నా బిడ్డపై అంచనాలు, ఆశలు పెట్టుకుని అవి నేరవేరకపోతే నిరాశ చెందుతాను. అందుకే ఆ నిర్ణయాన్ని వారికే వదిలేస్తాను’ అని చెప్పుకొచ్చింది.


కాగా.. అలియా చివరిసారిగా రణబీర్ కపూర్‌తో ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ శివ’లో కనిపించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రంపై మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ.. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆలియా ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ నటిస్తోంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29, 2023న థియేటర్స్‌లో విడుదల కానుంది. అలాగే.. ‘వండర్ ఉమెన్’ ఫేమ్ గాల్ గాడెట్‌తో కలిసి ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోంది.







Updated Date - 2022-11-23T19:30:38+05:30 IST