చిక్కుల్లో అలియా భట్ సినిమా.. అమ్మని అలా చూపించడం కరెక్ట్ కాదంటూ..

ABN , First Publish Date - 2022-02-17T17:05:11+05:30 IST

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అలియా భట్ నటించిన తాజా చిత్రం ‘గంగూభాయి కతియావాడి’.

చిక్కుల్లో అలియా భట్ సినిమా.. అమ్మని అలా చూపించడం కరెక్ట్ కాదంటూ..

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అలియా భట్ నటించిన తాజా చిత్రం ‘గంగూభాయి కతియావాడి’. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా చిక్కుల్లో పడింది.


రచయిత హుస్సేన్ జైదీ రచించిన మాఫియా ‘క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా భన్సాలీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇది గంగూభాయ్ అనే ఓ వ్యభిచారి తన మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా ఏలిందనేది ఈ సినిమా కథ. దీంతో అమ్మని అసభ్యంగా చూపించారంటూ.. హుస్సేన్‌, భన్సాలీతో పాటు నటి అలియా భట్‌పై గంగుభాయి వారసులు కేసు పెట్టారు.


దీని గురించి లాయర్ నరేంద్ర దూబే.. ‘తల్లిని వేశ్యగా చూడాలని ఎవరూ కోరుకోరు. చివరికి వేశ్య కొడుక్కి కూడా అది నచ్చదు. కేవలం డబ్బు కోసమే, ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. ఇది తల్లీ కొడుకుల విషయం కాదు. ప్రతి స్త్రీకి గౌరవం, పరువుకి సంబంధించిన విషయం. అలాంటిది ఓ మహిళని అసభ్యకరంగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు.


హుస్సేన్ జైదీ తన పుస్తకంలో గంగూబాయి ఎప్పుడూ వేశ్యగా మారాలని కోరుకోలేదని చెప్పాడు. అలాంటప్పుడు ఆ స్త్రీని వేశ్యగా చిత్రీకరిస్తారా?. నిజానికి ఆమె ఒక సామాజిక కార్యకర్త. మొరార్జీ దేశాయ్, జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఎన్నికల సమయంలో ఆమె కోసం వారు ఇంటికి వచ్చేవారని గంగుభాయి కుంటుంబ సభ్యులు తెలిపారు. ఎందుకంటే కామాటిపురలో పేరుగాంచిన ఈమె వేశ్యల హక్కుల కోసం పోరాడింది’ అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి గంగుభాయి బాబురావు, శాకుంతల, బేబీ, రజన్‌ని దత్తత తీసుకుని పెంచుకుంది. వారు తమ తల్లిని అసభ్యకరంగా చూపించారని, అందుకే ఈ సినిమా విడుదల ఆపేయాలని కోరుతూ కేసు ఫైల్ చేశారు.

Updated Date - 2022-02-17T17:05:11+05:30 IST