దాని నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నా: ఆలియాభట్‌

ABN , First Publish Date - 2022-02-20T23:59:07+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో సీతగా టాలీవుడ్‌లో అడుగు పెడుతోంది బాలీవుడ్‌ క్యూటీ ఆలియాభట్‌. అంతకన్నా ముందే బాలీవుడ్‌ చిత్రం ‘గంగూబాయ్‌ కతియావాడి’తో ప్రేక్షకులను పలకరించనుంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన జయంతీలాల్‌ గడ నిర్మించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి ఆలియాభఠ్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

దాని నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నా: ఆలియాభట్‌

మూడేళ్లగా ప్రేమలో ఉన్నా... 

ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నా...

ప్రతి ఒక్కరూ గంగూ పాత్రతో ప్రేమలో పడతారు..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆగిపోకూడదు: 

ప్యాన్‌ ఇండియా స్టార్‌ కోరిక.. కారణం ఆవిడే! 

పుష్పతో ఆ నమ్మకం కలిగించింది

– ఆలియాభట్‌


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో సీతగా టాలీవుడ్‌లో అడుగు పెడుతోంది బాలీవుడ్‌ క్యూటీ ఆలియాభట్‌. అంతకన్నా ముందే బాలీవుడ్‌ చిత్రం ‘గంగూబాయ్‌ కతియావాడి’తో ప్రేక్షకులను పలకరించనుంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన జయంతీలాల్‌ గడ నిర్మించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి ఆలియాభఠ్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 


నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు (2005) సంజయ్‌ సర్‌ ‘బ్లాక్‌’ సినిమా ఆడిషన్‌లో పాల్గొన్నా. అప్పుడు సెలెక్ట్‌ కాలేదు. కానీ ఆయన నా కళ్లలోకి చూసి నేను కచ్చితంగా హీరోయిన్‌ అవుతానని చెప్పారు. ఆ తర్వాత ఈ సినిమా కోసం నన్ను పిలిచారు. మొదట కథ విని భయపడ్డా. నేనిది చేయగలనా అని ఆయన్ని అడిగాను. ఎందుకంటే గతంలో నేను పోషించిన పాత్రలకి పూర్తి భిన్నమైన పాత్ర ఇది. నేను చేయగలనని సంజయ్‌ బాగా నమ్మారు. నేను ఎంచుకున్న పాత్రల్లో నన్ను నేను ఊహించుకుంటా. ఏ సీన్‌ ఇచ్చినా మనసులో ఊహించుకుని వెంటనే చేసేస్తాను. ఈ సినిమా విషయంలో సంజయ్‌లీలా భన్సాలీ చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అయ్యాను. సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం బరువు కూడా పెరగాల్సి వచ్చింది. గుజరాతీ యాస పట్టుకోవడం కాస్త కష్టమయ్యింది. పైగా గంగూబాయ్‌ కథంతా 1950ల కాలంలో జరిగింది. అప్పటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా నటించాల్సి వచ్చింది.




ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు... 

హుేస్సన్‌ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’  ఆధారంగా రూపొందిన చిత్రమిది. అందులో గంగూబాయ్‌ది చిన్న చాప్టర్‌ అంతే! దానిని మెయిన్‌ పాయింట్‌గా తీసుకుని దర్శకుడు ఈ చిత్రం తీశాం. గంగూబాయ్‌ పాత్ర చాలా సవాల్‌గా అనిపించింది. సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ పాత్రలో ప్రేమలో పడతారు. సినిమా చేసేటప్పుడు నేను గంగూ జీవితంలోకి వెళ్లిపోయాను. నా జీవితంలో కామాఠిపురని ఎప్పుడూ చూడలేదు. ముంబైలోని ఫిల్మ్‌ సిటీలో వేసిన కామాఠిపుర సెట్‌కి మాత్రమే వెళ్లాను. అక్కడికి వెళ్లగానే వేరొక మనిషిలా మారిపోయేదాన్ని. కొన్నిసార్లు ఇంట్లో కూడా నాకు తెలియకుండానే గంగూబాయ్‌లా కూర్చునేదాన్ని. తనలాగే మాట్లాడేదాన్ని. మా ఇంట్లో వాళ్లంతా నువ్వెవరు, నువ్వు ఆలియావి కాదా అనేవారు. మీరు మీలా కాకుండా వేరొకరిలా మారడం అంత ఈజీ కాదు. నేను మారానంటే ఆ క్యారెక్టర్‌ అంత ఎమోషనల్‌గా ఉండటం వల్లే. తను రెబెల్‌. తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎదిరించింది. బలమైన శక్తిగా ఎదిగింది. అదే తన గొప్పదనం. ఇందులో గంగూకి ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా అజయ్‌ దేవగణ్‌ నటించారు. ఆయన వల్లే గంగూ జీవితం మలుపు తిరుగుతుంది. ఆయనతో నటించడం గొప్ప అనుభూతి. 


మూడేళ్ల ప్రేమ... 

నిజం చెప్పాలంటే నేను ఇప్పటికీ ఆ పాత్రలో ఉండిపోయాను. ఆ ఎటాచ్‌మెంట్‌ నా నుండి పోవడం లేదు. గంగూబాయ్‌ పాత్ర అంతగా నన్ను ప్రభావితం చేసింది. కరోనా వల్ల రెండేళ్లపాటు ఈ సినిమాతోనే ఉన్నాను కదా అందుకే ఆ కథ నుంచి బయటకు రావడం కష్టంగా ఉంది. మూడేళ్లగా ఈకథతో ప్రేమలో ఉన్నా... సినిమా చూశాక కానీ నేను రిలాక్స్‌ అవ్వలేను. ఒక సీన్‌ చేయడానికి ఒకటే పద్దతి ఉందడని ఈ సినిమాతో నేర్చుకున్నా.  




శ్రీదేవిగారే నాకు స్ఫూర్తి...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కంటే ముందే ‘గంగూబాయ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో ముద్ర వేయబోతున్నారా? అని చాలామంది అడుగుతున్నారు. అయితే ఇవన్నీ ప్లాన్‌ ప్రకారం జరుగుతున్నవి కాదు. అలా కుదిరాయంతే! ప్యాన్‌ ఇండియా యాక్టర్‌ కావాలన్నది నా డ్రీమ్‌. ఈ విషయంలో శ్రీదేవిగారు నాకు స్ఫూర్తి. ఆవిడ తెలుగు,  తమిళం, హిందీ అంటూ ప్రతి భాషలోనూ స్టార్‌గా ఎదిగారు. నేను అలా అవ్వాలనేదే నా కోరిక. దానికి భాష సరిహద్దు కాదని నా నమ్మకం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. దేవుడి దయవల్ల అది అక్కడితో ఆగిపోకుండా తెలుగులో నా ప్రయాణం కొనసాగాలని ఆశిస్తున్నా. 


‘పుష్ప’’తో ఆ నమ్మకం... 

కరోనా తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమా ఇది. చాలానెర్వస్‌గా ఉంది. కరోనా వల్ల ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో బుర్రలో ఎన్నో ఆలోచనలు తిరుగుతుండేవి.  పరిస్థితులు చక్కబడేలా కనిపించడం లేదు. భవిష్యత్తులో ప్రేక్షకులు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ని మర్చిపోయారా? ఇంతకు ముందులాగే థియేటర్లకు వస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలను వెంటాడేవి. పుష్ప సినిమాతో థియేటర్లక ఇప్రేక్షకులు వస్తారనే నమ్మకం కలిగింది. 




Updated Date - 2022-02-20T23:59:07+05:30 IST