Boycott Brahmastra: తన సినిమాపై వస్తున్న నెగిటివిటీపై.. ఆలియా భట్ రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - 2022-09-08T15:48:45+05:30 IST

బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్,

Boycott Brahmastra: తన సినిమాపై వస్తున్న నెగిటివిటీపై.. ఆలియా భట్  రియాక్షన్ ఇదే..

బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.


అయితే.. ఈ సినిమాకి కూడా బాలీవుడ్‌లోని విడుదల అవుతున్న మిగిలిన సినిమాల్లాగే.. ఈ మూవీకి కూడా బాయ్‌కాట్ సెగ తగిలింది. రణ్‌బీర్, ఆలియా స్టార్ కిడ్స్ కావడం, కరణ్ జోహార్ ఈ మూవీకి నిర్మాత కావడం, ఇష్టం లేకపోతే సినిమా చూడకండని ఆలియా పొగరుగా మాట్లాడడంతో ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండింగ్ చేశారు. దీంతో మూవీ టీం సినిమా ఫలితంపై కొంచెం సందిగ్ధంలో పడింది. దీనిపై తాజాగా ఆలియా భట్ స్పందించింది.


ఆలియా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాపై ఎటువంటి నెగిటివిటీ లేదు. అంతా పాజిటివ్‌గానే ఉంది. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి బాయ్‌కాట్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు’ అని సమాధానం చెప్పింది. కాగా.. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నటుడు నాగార్జున, నాగినీ ఫేమ్ మౌనీ రాయ్ కీలకపాత్రల్లో నటించారు. కాగా.. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్సాన్స్ అందుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ మూవీ అంచనాలను అందుకుని బాలీవుడ్‌లో ఫెయిల్యూర్స్‌ని ఆపేస్తుందా లేక బాయ్‌కాట్‌లో కొట్టుకుపోతుందా చూడాలి మరి.

Updated Date - 2022-09-08T15:48:45+05:30 IST