ఆ విషయంలో దీపికా పదుకొనేను ఫాలో అయిన ‘RRR’ బ్యూటీ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-04-26T16:02:14+05:30 IST

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన నటి అలియా భట్...

ఆ విషయంలో దీపికా పదుకొనేను ఫాలో అయిన ‘RRR’ బ్యూటీ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన నటి అలియా భట్. ఇటీవలే ఈ బ్యూటీకి బాలీవుడ్ యువ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లైన విషయం తెలిసిందే. అయితే.. పెళ్లైన వెంటనే ఈ జంట తమ మూవీ షూటింగ్స్ బిజీ అయిపోయింది. కాగా.. తాజాగా అలియా ముంబైలో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళుతూ మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




ఆ వీడియోలో.. అలియా నీలం రంగు డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించింది. ఈ నవవధువు ఎంతో సంతోషంగా మీడియాకి చేతులు ఊపుతూ విష్ చేసి, ఫొటోలకి ఫోజులిచ్చింది. అయితే.. ఈ భామ హెయిర్ స్టైల్ అందరినీ ఆకర్షించింది. ఈ తార జట్టు మధ్యలో ఉన్న పాపిట కారణంగా నెట్టింట ట్రోలింగ్‌కి గురైంది. ఎందుకంటే.. ఇంతకుముందే ఆ స్టైల్‌తో దీపిక ఎన్నోసార్లు మీడియా ఫొటోలకి ఫోజులిచ్చింది. దీంతో దీపికని అనుసరిస్తోందంటూ అలియాపై ట్రోలింగ్ చేస్తున్నారు. ‘ఎందుకు అలియాని రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకున్నాడో అర్థం కావట్లేదు’, ‘దీపికాలా ఉందని పెళ్లి చేసుకున్నాడు కావొచ్చు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-04-26T16:02:14+05:30 IST