Alia Bhatt: కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ

ABN , First Publish Date - 2022-10-01T01:23:31+05:30 IST

చిన్న తనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ ఆలియా భట్ (Alia Bhatt). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ తో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది.

Alia Bhatt: కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ

చిన్న తనంలోనే  సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ ఆలియా భట్ (Alia Bhatt). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ తో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది. కెరీర్ ప్రారంభించినప్పుడు అనేక విమర్శలు ఎదుర్కొంది. అనంతరం ‘టూ స్టేట్స్’, ‘హైవే’, ‘రాజీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ‘గంగూబాయి కతియా వాడి’, ‘డార్లింగ్స్’ (Darlings) మూవీస్‌తో అబ్బురపరిచింది. నిర్మాత, ఎంటర్‌ప్రెన్యూర్ వంటి పలు పాత్రలను కూడా ఆలియా భట్ నిర్వహిస్తుంటుంది. ఇప్పటికే ఆమె చిన్న పిల్లల దుస్తుల బ్రాండ్‌‌ను లాంచ్ చేసింది. తాజాగా మరో కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సొంతంగా మెటర్నిటీ వేర్ బిజినెస్‌ను లాంచ్ చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 


గర్భిణీగా ఉన్నప్పుడు దుస్తులను కొనుగోలు చేసేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆలియా భట్ చెప్పింది. ‘‘రెండేళ్ల  క్రితం చిన్న పిల్లల దుస్తుల బ్రాండ్‌ను నేను లాంచ్ చేశాను. నీకు పిల్లలు లేనప్పుడు చిన్న పిల్లల దుస్తుల బ్రాండ్‌ను ఎందుకు లాంచ్ చేస్తున్నావని ప్రతి ఒక్కరు నన్ను అడిగారు. ప్రస్తుతం నేను సొంతంగా మెటర్నిటీ వేర్‌ను లాంచ్ చేస్తున్నాను. ఈ సారి ఎవరు కూడా నన్ను అడగరని అనుకుంటున్నాను’’ అని ఆలియా భట్ చెప్పింది. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ దంపతులు జూన్‌లో తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఆలియా భట్ తాజాగా ‘బ్రహ్మాస్త్ర’ లో నటించింది. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.



Updated Date - 2022-10-01T01:23:31+05:30 IST