హాలీవుడ్ నుంచి ఇండియాకు రాగానే Alia Bhatt సర్‌ప్రైజ్

ABN , First Publish Date - 2022-07-10T23:00:52+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ ఆలియా భట్ (Alia Bhatt). రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట ఏడేళ్లు డేటింగ్ చేసిన అనంతరం ఏప్రిల్

హాలీవుడ్ నుంచి ఇండియాకు రాగానే Alia Bhatt సర్‌ప్రైజ్

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ ఆలియా భట్ (Alia Bhatt). రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట ఏడేళ్లు డేటింగ్ చేసిన అనంతరం ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆలియా బాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ‘రాజీ’, ‘హైవే’, ‘గంగూబాయి కతియవాడి’ వంటి చిత్రాలతో తనకు నటనలో ఎవరు సాటిరారని నిరూపించుకుంది. ఆమె హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ (Heart of Stone)లో నటిస్తుంది. టామ్ హార్పర్ (Tom Harper) దర్శకత్వం వహిస్తున్నాడు. గాల్ గాడోట్, జామీ డోర్నన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఆలియా ముగించింది. అనంతరం ఇండియాకు రాగానే ఆమెకు సర్‌ప్రైజ్ ఎదురయింది. 


ఆలియా భట్ భారత్‌లో దిగగానే భర్త రణ్‌బీర్ కపూర్ ఎదురయ్యి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అంతకు ముందు ఫొటోగ్రాఫర్స్.. ఆమె ముంబై ఎయిర్ పోర్టుకు రాగానే తల్లికాబోతున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఆమెను క్లిక్ మనిపించడం మొదలుపెట్టారు. కారు దగ్గరకు వెళుతుండగా ఫొటోగ్రాఫర్స్ రణ్‌బీర్ వచ్చాడని తెలిపారు. దీంతో ఆమె ఉత్సాహంగా కారు వద్దకు వెళ్లింది. ఆలియా వచ్చి రాగానే భర్త రణ్‌బీర్ కపూర్ ఎదురయ్యి ఆమెను కౌగిలింతల్లో ముంచెత్తాడు. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ షూటింగ్‌ను పూర్తి చేశానని ఆలియా భట్ సోషల్ మీడియా వేదికగా చెప్పింది. ‘‘మా సినిమా దర్శకుడు టామ్ హార్పర్, అందమైన గాల్ గాడోట్‌కు థ్యాంక్ యూ. నాకు మరచిపోలేని అనుభూతిని చిత్ర బృందం మిగిల్చింది. నన్ను బాగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. మీరందరు సినిమా చూసేవరకు నేను వేచి ఉండలేకపోతున్నాను’’ అని ఆలియా భట్ వెల్లడించింది. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లయిన మూడు నెలల్లోపే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని వెల్లడించారు. ఆస్పత్రిలో స్కానింగ్ తీసుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.



Updated Date - 2022-07-10T23:00:52+05:30 IST