కాంట్రాక్ట్ నోట్‌పై వాళ్లను సంతకం చేయమంటున్న అలియా- రణ్‌బీర్..?

ABN , First Publish Date - 2022-04-07T00:53:37+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ అలియా భట్- రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారు

కాంట్రాక్ట్ నోట్‌పై  వాళ్లను సంతకం చేయమంటున్న అలియా- రణ్‌బీర్..?

బాలీవుడ్ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ అలియా భట్- రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారు. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ జంట ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వారంలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఇవ్వబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. పెళ్లికి సంబంధించిన విషయాలను బయటికి వెల్లడించకూడదని తమ వెడ్డింగ్ టీంలను ఈ జంట కోరుతుందట. అందుకు అంగీకారం తెలుపుతూ కాంట్రాక్ట్ నోట్‌పై సంతకం చేయమంటున్నారని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


పెళ్లికి సంబంధించిన ఫొటోలను లీక్ చేయకుండా ఉండేందుకు అలియా- రణ్‌బీర్ కాంట్రాక్ట్ నోట్‌పై సంతకం చేయమంటున్నారట. ‘‘పెళ్లి పనులు చూసుకునేవారితో సహా వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌లు, స్టైలిస్ట్‌లను కూడా  సంతకం చేయమని అడుగుతున్నారు. వెడ్డింగ్ టీంని కూడా సైన్ చేయమని ఈ జంట అడిగింది. పెళ్లికి సంబంధించిన విషయాలను ఎవరితోను మాట్లాడకూడదు. ఫొటోలను లీక్ చేయకూడదు. కాంట్రాక్ట్ నోట్‌లో నియమ, నిబంధనలు కచ్చితంగా ఉన్నాయి’’ అని  ఈజంటతో సన్నిహితంగా మెలిగేవారు తెలుపుతున్నారు. కత్రినా కైప్, విక్కీ కౌశల్ కూడా తమ పెళ్లి సమయంలో ఇటువంటి కాంట్రాక్ట్ నోట్‌పై సంతకం చేయమన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి అతిథులుగా కరణ్ జోహార్, షారూఖ్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, అనుష్క రంజన్, రోహిత్ ధావన్, వరుణ్ ధావన్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. వివాహానికి ముందు రణ్‌బీర్ బ్యాచ్‌లర్ పార్టీని ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ పార్టీలో అర్జున్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, అయాన్ ముఖర్జీతో సహా రణ్‌బీర్ చిన్ననాటి మిత్రులు సందడి చేయనున్నట్టు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-04-07T00:53:37+05:30 IST