ఆ రోజున టీవీలోనే ప్రసారం కానున్న అల వైకుంఠపురంలో హిందీ వెర్షన్

ABN , First Publish Date - 2022-01-23T02:13:31+05:30 IST

బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘అల వైకుంఠపురంలో’. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

ఆ రోజున టీవీలోనే ప్రసారం కానున్న అల వైకుంఠపురంలో హిందీ వెర్షన్

బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘అల వైకుంఠపురంలో’. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. గోల్డ్ మైన్స్ టెలీఫిలింస్ అధినేత మనీశ్ షా వద్ద ‘అల వైకుంఠపురంలో’ డబ్బింగ్ హక్కులు ఉన్నాయి. ఆ సినిమాని గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాదాపుగా 200 స్క్రీన్స్‌లో విడుదల చేస్తామని మనీశ్ తెలిపారు.

 

అయితే, ఆ సినిమాని హిందీలో ఇప్పటికే ‘షెహజాదా’ పేరుతో రీమేక్ చేశారు. రీమేక్ వెర్షన్‌కు అల్లు అరవింద్, అమన్ గిల్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. డబ్బింగ్ వెర్షన్ విడుదలైతే, రీమేక్‌కు నష్టం చేకూరుతుందని ‘షెహజాదా’ నిర్మాతలు భావించారు. దీంతో మనీశ్ షాతో వారు చర్చలు జరిపారు. డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయొద్దని కోరారు. అందుకు మనీశ్ షా ఒప్పుకున్నారు. ఆ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటన జారీ చేశారు. నేరుగా టీవీలోనే ప్రీమీయర్ వేయలని ఆయన నిర్ణయించారు. ధించాక్ ఛానల్‌లో ఆ సినిమా ఫిబ్రవరి 6న ప్రసారం కానుంది. ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆ ఛానల్ ఒక ప్రకటన‌ను వెలువరించింది.

Updated Date - 2022-01-23T02:13:31+05:30 IST