Anupam Kher సినిమా కావాలంటూ... Akshay Kumar సినిమాని అడ్డుకున్నారు!

ABN , First Publish Date - 2022-03-22T23:32:17+05:30 IST

ఓ వైపు అక్షయ్ కుమార్ ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా బావుందంటూ ప్రశంసలు కురిపించాడు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన సినిమాతో జనాన్ని మళ్లీ పెద్ద ఎత్తున థియేటర్లకు తీసుకురాగలిగాడని పొగిడాడు. కానీ, ఆయన ఫ్యాన్స్‌కి మాత్రం ‘కాశ్మీర్ ఫైల్స్’ సెగ తప్పటం లేదు! ‘బచ్చన్ పాండే’ వద్దు... ‘ద కాశ్మీర్ ఫైల్స్’ ముద్దు అంటూ ఒడిషాలోని ఓ

Anupam Kher సినిమా కావాలంటూ... Akshay Kumar సినిమాని అడ్డుకున్నారు!

ఓ వైపు అక్షయ్ కుమార్ ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా బావుందంటూ ప్రశంసలు కురిపించాడు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన సినిమాతో జనాన్ని మళ్లీ పెద్ద ఎత్తున థియేటర్లకు తీసుకురాగలిగాడని పొగిడాడు. కానీ, ఆయన ఫ్యాన్స్‌కి మాత్రం ‘కాశ్మీర్ ఫైల్స్’ సెగ తప్పటం లేదు! ‘బచ్చన్ పాండే’ వద్దు... ‘ద కాశ్మీర్ ఫైల్స్’ ముద్దు అంటూ ఒడిషాలోని ఓ థియేటర్‌లో కొందరు రచ్చ చేశారట. దాంతో అక్షయ్ కుమార్ స్టారర్ మూవీ తాలూకు షో కాస్తా ఆపేయాల్సి వచ్చింది.


ఒడిషాలో ‘బచ్చన్ పాండే’ సినిమా ప్రదర్శించవద్దని కొందరు గందరగోళం చేయటం... ఈ కోవలో ఇదే మొదటిదేం కాదు. ఇంకా పలు చోట్ల 10 నుంచీ 100 మంది దాకా పోగవుతోన్న ముఠాలు థియేటర్ల వద్ద తీవ్రమైన గడబిడ చేస్తున్నాయట. ఓ చోటైతే ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలోంచీ ఫలానా సీన్ కట్ చేశారంటూ మ్యానేజర్‌తో వాగ్వాదానికి దిగినట్లు ప్రచారం అవుతోంది. అసలు థియేటర్‌ సిబ్బంది సినిమాలోంచీ సీన్ ఎలా తొలగించగలరని ఎగ్జిబిటర్స్ నిరసనకారుల్ని ప్రశ్నిస్తున్నారు. 


వివాదాల మాటెలా ఉన్నా... అక్షయ్ లాంటి సూపర్ స్టార్, కృతి సనోన్ లాంటి హీరోయిన్ ఉన్నా కూడా ‘బచ్చన్ పాండే’ అత్యంత తక్కువ వసూళ్లు రాబడుతోంది. తొలి వారాంతంలో కేవలం 34 కోట్లతో నిర్మాతలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ మాత్రం 11 రోజుల్లో 180 కోట్ల అనూహ్య కలెక్షన్లు సాధించింది. ఇంకా హౌజ్‌ఫుల్ బోర్డులతో దూసుకుపోతోంది... 


‘ద కాశ్మీర్ ఫైల్స్’ పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. బీజేపీ గట్టిగా సమర్థిస్తుండగా కాశ్మీరీ పొలిటీషన్స్, కాంగ్రెస్, ఇతర పార్టీల వారు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, ‘కాశ్మీర్ ఫైల్స్’ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా తన ‘బచ్చన్ పాండే’ బాక్సాఫీస్ నష్టాలు మూటగట్టుకున్నప్పటికీ... వివేక్ అగ్నిహోత్రి చిత్రంపై అక్షయ్ పొగడ్తల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అనుపమ్ ఖేర్ నటన మహాద్భుతం అన్నాడు ‘ఖిలాడీ’ స్టార్!

Updated Date - 2022-03-22T23:32:17+05:30 IST